Home / జాతీయం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుర్తింపును ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభించాలని మరియు ప్రభుత్వ ఉద్యోగులను ప్రేరేపించడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దాని చిహ్నాన్ని రద్దు చేయాలని కోరుతూ రిటైర్డ్ బ్యూరోక్రాట్ల బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్‌కు లేఖ రాసింది.
ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని దిల్కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు.
ఓ కారు అతి వేగానికి ఇద్దరు యువ సాఫ్ట్ వేర్లు మృతి చెందారు. ప్రధాన నగరాల్లో జాతీయ రహదారుల్లో ప్రభుత్వ ఉదాశీనతతో చోటుచేసుకొన్న ఈ ఘటన తమిళనాడు చెన్నైలో చోటుచేసుకొనింది పోలీసుల సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువతులు ఓల్డ్ మహా బలిపురం రోడ్డు దాటుతుండగా ఓ కారు వారివురిని ఢీకొట్టింది.
ఉబ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో రేపటి నుంచి జరగనున్న ఎస్సీఓ సమ్మిట్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయలుదేరి వెళ్లనున్నారు. సమర్ఖండ్లో ప్రధాని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు ఇతర దేశాల నాయకులతో భేటీ అవుతారు.
లక్నోలోని దారుల్ ఉలూమ్ నదావతుల ఉలేమాలో ముస్లింలు నిర్వహించే సెమినార్ల పై యూపీ సర్కార్ సర్వే నిర్వహించింది. ఇక్కడ నిర్వహించే సెమినార్లకు ప్రభుత్వం అనుమతి లేదని స్పష్టం చేసింది. జిల్లా మైనార్టీ అధికారి సోనే కుమార్‌తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను ఆయన బెదిరిస్తున్నారని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. పదే పదే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.
దేశంలో సర్వత్రా 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో హిందూ జనాభా అధికంగా ఉన్న ఏడు గ్రామాలను వక్ఫ్ బోర్డు తమ సొంత గ్రామాలుగా పేర్కొంది. ఇది మాత్రమే కాదు. 1500 సంవత్సరాల పురాతన దేవాలయం పై కూడా తమదే అని చెబుతోంది.
ప్రత్యేక హోదా అంశమే ప్రధానంగా 2024లో ఎన్నికల అజెండాగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తానాయా అంటే అవుననేలా బీహార్ సిఎం నితీశ్ కుమార్ మాట్లాడుతున్నారు
అతను ఏ లాటరీ టికెట్టు కొనలేదు.. ఆన్లైన్ ట్రేడింగ్ చెయ్యలేదు కానీ కోటీశ్వరుడయ్యాడు. అదెలా అనుకుంటున్నారా... బ్యాకింగ్ సేవల్లో పొరపాటు వల్ల ఓ వ్యక్తి ఒక్కరోజు కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది.