Home / జాతీయం
పంజాబ్‌లోని భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారతీయ జనతాపార్టీ కుట్రలు పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలన్ని తోసి పుచ్చుతోంది.
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐాఆర్ సిటిసి ) బుధవారం భారత్ గౌరవ్ రైలును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
పైలట్లు మరియు క్యాబిన్ సిబ్బందితో సహా విమానయాన సిబ్బంది అక్టోబర్ 15 నుండి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. ఈమేరకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ మరియు అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ బుధవారం వర్చువల్ కోర్టు విచారణ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన వీరిద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఢిల్లీకి వెల్లతారు. అక్కడే నివాసం ఉండాలంటారు. అది కూడా అప్పనంగా ప్రభుత్వం నివాసమే కావాలంటారు. ఇది నేటి ప్రజా ప్రతినిధుల తీరు. అలాంటి వారికి ఢిల్లీ కోర్టు ఒప్పుకొనేది లేదంటూ ఓ మాజీ ప్రజాప్రతినిధికి ఖాళీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
కేరళ ప్రభుత్వం సోమవారం నాడు, కపికో కేరళ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది. దీనిద్వారా అలప్పుజలో రూ. 200 కోట్ల విలువైన సెవెన్ స్టార్ రిసార్ట్ కూల్చివేతకు రంగం సిద్దమయింది.
గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
విద్యుత్ సబ్సిడీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో మరోమారు ఢిల్లీ ప్రభుత్వం మిస్ట్ కాల్ ఇవ్వండి, విద్యుత్ సబ్సిడీ పొందండి అంటూ ప్రకటించింది.
మనలో దేవుళ్లను నమ్మేవారు చాలా మంది ఉంటారు. వారంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పండుగల సమయంలో దేవాలయాలకు వెళ్తుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో గుడి వెళ్లే ఉంటారు.
దశాబ్ధాల పార్టీ చరిత్రతో చేపట్టనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బరిలో ఎవరననే అంశంపై చర్చ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. పార్టీలో ప్రక్షాళనతో పాటుగా ఎన్నికలు పారదర్శకంగా చేపట్టేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టి సారించడంతో అధ్యక్ష సీటుగా పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.