Home / జాతీయం
ఒకవైపు భార్య మంచం పట్టింది.. మరోవైపు ఎలాంటి చలనం లేని దివ్యాంగురాలైన 14 ఏళ్ల కుమార్తె. ఆమెకు అన్నం తినిపించడంతోపాటు అన్ని పనులు కన్న తండ్రే చేయవలసి వచ్చేది.
రాజస్థాన్ లో సీఎం మార్పు తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీస్తోందని చెప్పవచ్చు. సీఎంగా సచిన్ పైలట్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గెహ్లాట్ వర్గం కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా నిరసన బావుటా ఎగురవేసింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కులులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న ఓ టెంపో ట్రావెలర్ ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది. దానితో 7 ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ గ్రామంలోని పెళ్లిలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికి వచ్చిన అతిథులు ఆధార్ కార్డు చూపిస్తేనే విందు భోజనం పెడతామంటూ పెళ్లికూతురి కుటుంబం శరతు పెట్టింది. మరి ఇలా వారు ఆ వింతైన శరతు ఎందుకు పెట్టారో ఓ సారి చూసేద్దామా..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడిపై ముగ్గురు స్నేహితులు గ్యాంగ్ రేప్ కి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోతోంది అంటూ స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించి, గత కొద్ది కాలంగా పార్టీ నుంచి సంబంధ బాంధవ్యాలు తెంచుకున్న గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడుపోసుకోనుంది. కాగా నేడు పార్టీ పేరు, దానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఆజాద్ ప్రకటించనున్నారు.
భాజాపాయేతర ప్రభుత్వమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎంతో ముఖ్యం. ఈ నేపధ్యంలో ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధీని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇరువరు కలిసారు
జాతీయ స్థాయిలో పార్టీని స్థాపించాలనుకొనే నేతలకు విపక్ష పార్టీలు చెక్ పెట్టాయి. భాజాపాయేతర ప్రభుత్వంగా ఏర్పడాలని, అందుకు కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలకు కేరాఫ్ ప్రధాన ఫ్రంట్ ఒక్కటేనంటూ నేతలు పిలుపునిచ్చారు
హిందూ, ముస్లిం మద్య గొడవలు సృష్టించడమే భాజాపా, ఆర్ఎస్ఎస్ ల పనిగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆయన ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
బాత్రూమ్లో 19 ఏళ్ల యువతి దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాన్ని ముగ్గురు విద్యార్థులు వీడియో తీశారు. ఆ క్లిప్‌ను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరించి ఆమె నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. తీరా చూస్తే అసలు విషయం తెలుసుకుని రంగ ప్రవేశం చేసిన పోలీసులకు నిందితుల్లో ఒకరు చిక్కారు, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.