Home / జాతీయం
లోకల్ రైళ్ల కంటే మెరుగైన రవాణా అందించే ఉద్దేశంతో వందే మెట్రో తీసుకువస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది.
కర్ణాటకలో అధికార బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాలను ఎంచుకుని వారికే టికెట్స్ ఇస్తున్నాయి.
Kejriwal: దేశ రాజకీయాల్లో కీలక పరిమాణం చోటు చేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో భాగంగా.. దిల్లీ మద్యం విధానంపై ఆయన్ను సీబీఐ ప్రశ్నించనుంది.
Covid Cases: గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు కూడా రోజురోజుకు బాగా పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 11,109 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు కంటే 9 శాతం అధికంగా కేసులు నమోదు అయినట్టు తెలిపింది. తాజా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలకు దగ్గరైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం కేసులు 49,622 గా ఉన్నాయి. కొవిడ్ కారణంగా మరో […]
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 వ జయంతిని పురస్కరించుకొని నేడు హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్ సమీపాన ఎన్టీఆర్ గార్డెన్ కు ఆనుకుని ఉన్న స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే ఎత్తైనది కావడం విశేషం.
దివంగత హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ బుధవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువునష్టం ఫిర్యాదుతో మహారాష్ట్రలోని కోర్టును ఆశ్రయించారు.లండన్‌లో తన ప్రసంగంలో సావర్కర్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపి, గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ గురువారం ఉత్తరప్రదేశ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతనితో పాటు ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ షూటర్ గులాం కూడ మరణించాడు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఆధ్వర్యంలోని 11వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాల నుంచి స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రస్తావనలు తొలగించబడ్డాయి.
విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం బీబీసీపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఈడీ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ప్రకారం కొంతమంది కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల స్టేట్మెంట్ల రికార్డింగ్‌ను కూడా కోరింది.
ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి సుమారుగా 71,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.