Home / జాతీయం
దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, యూపీలోని వారణాసిలో కూరగాయల విక్రయదారుడు కస్టమర్లు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చినప్పుడు వారిని దూరంగా ఉంచేందుకు బౌన్సర్లను నియమించుకున్నాడు.
నకిలీ బిల్లింగ్ ద్వారా పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వస్తువులు మరియు సేవల పన్ను నెట్వర్క్ ( జీఎస్టీఎన్ )ని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) పరిధిలోకి చేర్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జీఎస్టీఎన్ పరిధిలో పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా చర్య తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కి మరింత అధికారం లభించనుంది
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ గురించి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌ను పంచుకున్నారనే ఆరోపణలపై ఇండోర్ పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్రప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు చేసారు.స్థానిక న్యాయవాది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయింది.
Madya Pradesh Viral News: జనాల రోజురోజుకు తెలివిమీరిపోతున్నారు. మార్కెట్ కు తగ్గట్లు బిజినెస్ చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటే అది టమాటా అనే చెప్పుకోవాలి.
మేడ్-ఇన్-ఇండియా సెమీ-హై-స్పీడ్ రైలు వందే భారత్ యొక్క 28వ రేక్ ప్రస్తుతం ఉన్న నీలం మరియు తెలుపు రంగులకు బదులుగా కుంకుమపువ్వు మరియు బూడిద రంగు కలయికలో ఉంటుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 25 రేక్‌లు తమ నిర్దేశిత మార్గాల్లో పనిచేస్తున్నాయని, రెండు రేకులు రిజర్వ్‌లో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
దేశరాజధాని ఢిల్లీలో 24 గంటల్లో రికార్డు స్దాయిలో 153 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీనితో ఢిల్లీలో 41 ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత జులైలో ఒక్కరోజులో ఇదే అత్యధిక వర్షపాతం అని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Bengal Panchayat Polls: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం అల్లర్లతో అతలాకుతలం అయ్యింది. రోడ్లన్నీ రక్తసిక్తంగా మారాయి. ఎన్నికల్లో తీవ్ర హింస చెలరేగింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు వరంగల్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అలానే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అల్లర్లు చెలరేగుతున్నాయి.. అక్కడి పరిస్థితి ఎన్నికలంటే అల్లర్లు.. అల్లర్లంటే ఎన్నికలు అన్నట్లుగా తయారయ్యిందని చెప్పవచ్చు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయగా.. పోలీసులు నిఘా నీడలో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ గస్తీ కాస్తున్నారు. ఈ పర్యటన నిమిత్తం దాదాపు 3500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నగరంలో ఉదయం 8 గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు