Last Updated:

Gang Rape : మధ్యప్రదేశ్ లో నిర్భయ తరహ ఘటన.. యువతిపై సామూహిక అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్ లో !

ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో మహిళలు, చిన్నారులకు.. బయటే కాదు ఇంట్లో కూడా ర‌క్ష‌ణ‌ లేకుండా పోతుంది అనే ఘటనలు రోజు మనం చూస్తూనే ఉంటున్నాం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఆ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

Gang Rape : మధ్యప్రదేశ్ లో నిర్భయ తరహ ఘటన.. యువతిపై సామూహిక అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్ లో !

Gang Rape : ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో మహిళలు, చిన్నారులకు.. బయటే కాదు ఇంట్లో కూడా ర‌క్ష‌ణ‌ లేకుండా పోతుంది అనే ఘటనలు రోజు మనం చూస్తూనే ఉంటున్నాం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఆ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏండ్ల బాలికపై ఇద్దరూ కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అంతటితో ఆగకుండా మరో దారుణానికి ఒడిగట్టారు. విచక్షణ రహితంగా బాలికపై దాడి చేస్తూ.. ప్రైవేట్ పార్ట్‌లో కర్రను చొప్పించారు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్నా జిల్లాలోని మైహార్‌లోని ప్రముఖ ఆలయ ట్రస్టులో పనిచేస్తున్న ఇద్దరు కామాంధులు.. 12 ఏండ్ల బాలికకు మాయ మాటలు చెప్పి.. ట్రస్టు సమీపంలోని కొండపైకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బాలిక శరీరంపై గాయాలు చేస్తూ.. ప్రైవేట్ పార్ట్‌లో కర్రను చొప్పించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ మైనర్ బాలిక రక్తంతో తడిసి ఇంటికి చేరుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

gang rape

బాధితురాలు బంధువులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. వాంగ్మూలం ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ సత్నా అశుతోష్ గుప్తా తెలిపారు. సత్నా జిల్లాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం రీవా మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. కాగా వారి కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుల ఇళ్లను కూల్చేసినట్లు సమాచారం అందుతుంది।