Home / జాతీయం
అమర్నాథ్ యాత్రలో పాల్గొనేందుకు ఎక్కువ మందిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో, హోటల్స్ బుకింగ్ గదులపై అదనపు తగ్గింపులను అందించాలని ఆల్ జమ్మూ హోటల్స్ అండ్ లాడ్జెస్ అసోసియేషన్ నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన పబ్లిషర్ గీతా ప్రెస్‌కి 2021కి గాను గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఈరోజు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని జ్యూరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అపహస్యంగా పేర్కొన్నారు.
చెన్నై నగరంలో ఆదివారం అర్దరాత్రినుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వేలచేరి, గిండి, వేపేరి, జిఎస్టి రోడ్ మరియు కెకె నగర్ వంటి లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. చెన్నై విమానాశ్రయంలో దిగాల్సిన పది విమానాలను సోమవారం తెల్లవారుజామున బెంగళూరు విమానాశ్రయానికి మళ్లించగా, 17 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
: లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్లో శనివారం తీవ్రమైన వేడి కారణంగా లూప్‌లైన్‌లోని రైల్వే ట్రాక్‌లు కరిగిపోవడంతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్ గుండా వెళ్లడంతో ట్రాక్‌లు కరిగిపోయి వ్యాపించడంతో ఈ ఘటన జరిగింది.
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తమ నిరసన రాజకీయ ప్రేరేపితమైనది కాదని రెజ్లర్ సాక్షి మాలిక్ మరియు ఆమె భర్త సత్యవర్త్ కడియన్ చేసిన ప్రకటనపై మాజీ రెజ్లర్ బబితా ఫోగట్ ఆదివారం నాడు మండిపడ్డారు. వారు కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారారని కూడా ఆమె ఆరోపించారు.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమయింది. వరోవైపు సినిమాలోని కొన్ని డైలాగులు వివాదానికి దారి తీసాయి. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న భారీ ఆగ్రహానికి ప్రతిస్పందించిన మేకర్స్, ప్రేక్షకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని డైలాగ్‌లను సవరించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలోని ఆర్ కె పురం అంబేద్కర్ బస్తీ ప్రాంతంలో ఆదివారం ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. నిందితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వారిని అర్జున్ మరియు మైఖేల్‌గా గుర్తించారు. బాధితుల సోదరుడితో వారికి ఆర్థిక వివాదం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తర భారతదేశం తీవ్రమైన వేడిగాలులతో అల్లాడిపోతోంది. వడదెబ్బ కారణంగా ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో98 మంది మరణించారు. యూపీలో 54 మంది చనిపోగా, బీహార్‌లో గత మూడు రోజుల్లో 44 మంది మరణించారు.
Manipur Violence: మణిపూర్‌లో కొద్దిరోజులుగా అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ నిరసన కార్యక్రమాలు మరింత హింసాత్మకంగా మారాయి. దీనితో ఆ రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతుంది.
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న జుమాగండ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.