Last Updated:

Maharashtra Girder Accident : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. గిర్డర్ కూలి 17 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. థానే జిల్లా షాపూర్‌లో సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఈరోజు తెల్లవారు జామున బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గిర్డర్ అకస్మాత్తుగా కూలడంతో ఏకంగా 17 మంది మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Maharashtra Girder Accident : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. గిర్డర్ కూలి 17 మంది మృతి

Maharashtra Girder Accident : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. థానే జిల్లా షాపూర్‌లో సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఈరోజు తెల్లవారు జామున బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గిర్డర్ అకస్మాత్తుగా కూలడంతో ఏకంగా 17 మంది మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 100 అడుగుల ఎత్తు నుంచి గిర్డర్‌ యంత్రం పడిపోయినట్లు సమాచారం తెలుస్తోంది.

గత కొద్దిరోజులుగా సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే మూడవ దశ నిర్మాణం జరుగ్గుతోంది. రోడ్డు పనుల్లో భాగంగా థానేలోని సర్లాంబే గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండగా.. పిల్లర్లతో అనుసంధానించే గిర్డర్‌ యంత్రం ఒక్కసారిగా కుప్పకూలి కార్మికులపై పడింది. దీంతో ముందుగా 15 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మిగిలిన వారు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్రేషియా ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని వెల్లడించింది.