Home / జాతీయం
ప్రతీఏటా జరిగే అమర్నాథ్ వార్షిక యాత్ర శనివారం (జూలై 1) ప్రారంభమైంది. 62 రోజుల యాత్రను బల్తాల్ బేస్ క్యాంప్‌లో శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు సీనియర్ అధికారులతో పాటు డిప్యూటీ కమిషనర్ గందర్బల్ శ్యాంబీర్ జెండా ఊపి ప్రారంభించారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు విషాద ఘటన చోటు చేసుకుంది. బుల్ధానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తోన్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనం కాగా.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా మారింది. బస్సు యావత్మాల్ నుంచి
మణిపూర్ లో కొనసాగుతున్న హింసాకాండ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా లేఖను శుక్రవారం పలువురు మహిళలు చించివేశారు.బీరెన్ సింగ్ రాజీనామా పత్రంలో పాటు 20 మంది ఎంఎల్ఏలను తీసుకుని గవర్నర్ నివాసానికి బయలు దేరారు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 100 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేశాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 2022 మరియు జూన్ 2023 మధ్య కాలంలో, మొత్తం 2,140 ట్రిప్పుల్లో 25.20 లక్షల మంది ప్రయాణికులు ఈ సెమీ-హై స్పీడ్ రైళ్లలో ప్రయాణించినట్లు జూన్ 21 వరకు ఉన్న డేటా చూపుతోంది.
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన బ్లాక్ మరియు టేక్ డౌన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ట్విటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. కంపెనీ అభ్యర్ధనలో ఎలాంటి అర్హతలు లేవని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సవరించిన నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తికి రెండు సీలు చేసిన మద్యం బాటిళ్లను ఢిల్లీ మెట్రో లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని అధికారులు శుక్రవారంతెలిపారు. అయినప్పటికీ, మెట్రో ప్రాంగణంలో మద్యం సేవించడం పై ఇప్పటికీ నిషేధం ఉంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన మణిపూర్ పర్యటనలో రెండవరోజు శుక్రవారం మొయిరాంగ్‌కు వెళ్లారు. అక్కడ బాధిత ప్రజలను కలుసుకుని వారి కష్టాలను విన్నారు. మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ , పౌర సమాజ సంస్థ, యునైటెడ్ నాగా కౌన్సిల్ ప్రతినిధులు, మణిపూర్‌లోని నాగా కమ్యూనిటీ అపెక్స్ బాడీ, షెడ్యూల్డ్ తెగల డిమాండ్ కమిటీ మరియు ప్రముఖ వ్యక్తులను కూడా రాహుల్ గాంధీ కలిశారు.
Tamilnadu: ‘క్యాష్ ఫర్ జాబ్స్’, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుపాలైన మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి సంచలనం సృష్టించిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. రాత్రిరాత్రి ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఒక పోలీసు అధికారికి నగదు కట్టలతో అతని కుటుంబం సెల్ఫీ తీసుకున్న తక్షణమే బదిలీ అయింది. అతని భార్య మరియు పిల్లలు తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో వారు రూ. 500 నోట్ల కట్టలతో పోజులివ్వడంతో అతనిపై విచారణ ప్రారంభించబడింది
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు.ఢిల్లీ మెట్రోలో ప్రధాని దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు