Maharashtra News : మహారాష్ట్రలో ఒకే రోజు 18 మంది మృతి.. ఆ హాస్పిటల్ లోనే !
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ హాస్పిటల్ లో ఒకే రోజు 18 మరణించడం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా ఇంత మంది చనిపోవడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Maharashtra News : మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ హాస్పిటల్ లో ఒకే రోజు 18 మరణించడం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా ఇంత మంది చనిపోవడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాష్ట్రంలోని థానేలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ గవర్నమెంట్ హస్పిటల్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో ఒక్క రోజే 18 మంది మరణించారు. మరణించిన వారిలో పది మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. 10 మంది మహిళలు ఉన్నారు. మృతుల్లో థానే నగరానికి చెందినవారు ఆరుగురు ఉండగా.. కల్యాణ్‌కు చెందినవారు నలుగురు, షాపూర్ నుంచి ముగ్గురు, భీవాండి, ఉల్హాస్‌నగర్, గోవండి (ముంబయి) నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని మున్సిపల్ కమిషనర్ అభిజిత్ బంగర్ తెలిపారు. మృతుల్లో 12 మంది 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారని.. స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదేశించారని అభిజిత్ బంగర్ వెల్లడించారు. కమీషనర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నేతృత్వంలోని కమిటీ, ఈ మరణాలకు సంబంధించిన క్లినికల్ అంశాలపై దర్యాప్తు చేస్తుందని ప్రకటించారు.
మరణించిన వారిలో కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారని.. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క రోజులోనే 18 మంది మరణించడంతో ఆసుపత్రి దగ్గర ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మరణించిన రోగులు మూత్రపిండాల్లో రాళ్లు, దీర్ఘకాలిక పక్షవాతం, అల్సర్‌లు, న్యుమోనియా, కిరోసిన్ పాయిజనింగ్ నుండి సెప్టిసిమియా వరకు వివిధ వైద్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారని అభిజిత్ బంగర్ చెప్పారు. ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర మంత్రి అదితి తత్కరే మరణాలపై విచారం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.