Mobile phone ban in Ujjain : డిసెంబర్ 20 నుంచి ఉజ్జయిని మహాకాలేశ్వర ఆలయంలో మొబైల్ ఫోన్ నిషేధం
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయ సందర్శకులకు డిసెంబర్ 20 నుండి తమ మొబైల్ ఫోన్లను ప్రాంగణంలోనికి తీసుకెళ్లడానికి అనుమతించరు..
Ujjain Mahakaleshwar Temple: మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయ సందర్శకులకు డిసెంబర్ 20 నుండి తమ మొబైల్ ఫోన్లను ప్రాంగణంలోనికి తీసుకెళ్లడానికి అనుమతించరు..ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా డిసెంబర్ 20 నుంచి ఆలయం లోపల మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు సమావేశం అనంతరం సింగ్ తెలియజేశారు.భక్తులు మొబైల్ ఫోన్లు లేకుండా ఆలయానికి రావాలనిహోటళ్లు, ఇతర బస చేసే ప్రదేశాల్లో ఈ సమాచారాన్ని ఉంచాలని ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. పర్యాటకులకోసం ఉజ్జయిని నగరంలో లగ్జరీ ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు సింగ్ తెలిపారు.
అన్ని దేవాలయాలు మరియు పర్యాటక ప్రదేశాలను కవర్ చేసే రూట్లలో బస్సులు నడపబడతాయి. దీని కోసం సందర్శకులు ఒకే టికెట్ కొనుగోలు చేయాలని ఆయన చెప్పారు.భక్తుల సహాయార్థం 50 సమాంతర ఫోన్ లైన్లతో కాల్ సెంటర్ను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.