Home / తప్పక చదవాలి
ప్రజలు కొనగలిగే ధరలకు చమురును అందించడం భారత దేశ ప్రభుత్వం నైతిక కర్తవ్యమని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. ఆత్మరక్షణ ధోరణిలో పడిపోకుండా, రష్యా నుంచి చమురును కొంటున్నామని వివరించారు. మన దేశ విధానాన్ని ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఆమోదిస్తున్నాయని చెప్పారు .. బ్యాంకాక్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఇప్పటికే పలు నిత్యావసరాల ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్న ప్రజలను డెయిరీ కంపెనీలు కూడ బాదడం ప్రారంభించాయి. డెయిరీ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్న అమూల్ మంగళవారం ప్యాక్డ్ మిల్క్‌పై లీటరు ధరను రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది.
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల పేరిట రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకొకటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై పలు రాయితీలు ప్రకటించింది. ఈ ఆగస్టు 15న పుట్టే శిశువులు, వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం ప్రకటించారు.
’బయోలాజికల్ ఇ‘ యొక్క కార్బెవాక్స్ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మరియు కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్‌తో పూర్తిగా టీకాలు వేసిన వారికి (డబుల్ డోస్) బూస్టర్ లేదా ముందు జాగ్రత్త డోసుగా ఆమోదించబడింది. ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGEI) యొక్క COVID-19
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మరియు వీ (గతంలో వోడాఫోన్-ఐడియా) వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు తమ 5G సేవలను దేశంలో అందుబాటులోకి తీసుకురావడానికి సిద్దమవుతున్నారు..సెప్టెంబర్ 29 న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ 5G నెట్‌వర్క్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ లో పాల్గొనేందుకు ఎంపీలు పార్లమెంట్‌కు క్యూ కట్టారు. ప్రధాని మోదీ.. సహా ఎంపీలు అంతా తమ ఓటును వినియోగించుకున్నారు. సభలో 8 ఖాళీ స్థానాలు సహా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అస్సాం ప్రభుత్వం తేయాకుతోటల భూమిలో ఐదు శాతం వరకు పర్యావరణ అనుకూల టీ టూరిజం, గ్రీన్ పవర్ మరియు పశుపోషణకు ఉపయోగించేందుకు అనుమతించింది.ఒక ఆర్డినెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం అస్సాం ల్యాండ్ హోల్డింగ్ చట్టం 1956పై సీలింగ్‌ను సవరించింది.
వాట్సాప్ ప్రస్తుతం పలు ఫీచర్లపై పనిచేస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం వాట్సాప్ లాగిన్ ఆప్రూవల్ అనే కొత్త భద్రతా ఫీచర్‌ను కలిగి ఉంది. ఎవరైనా మరొక పరికరంలో వారి ఖాతాకు లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు లాగిన్ అప్రూవల్ యూజర్లకు వాట్సాప్ యాప్‌లో హెచ్చరికను పంపుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (MPC) శుక్రవారం రెపో రేటులో 50 బేసిస్ పాయింట్ల పెంపును 5.40 శాతానికి ప్రకటించింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డిఎఫ్) రేటు ఇప్పుడు 5.15 శాతంగా ఉండగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు 5.65 శాతంగా ఉంది.