Tirumala Brahmostavalu: బ్రహ్మోత్సవాలకు 5.69 లక్షలు మంది భక్తులు- టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి
పవిత్ర తిరుమలలో కన్నుల పండువుగా సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5.69లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నారని టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.
Tirumala Brahmostavalu: పవిత్ర తిరుమలలో కన్నుల పండువుగా సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5.69లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నారని టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ అన్నమయ్య భవన్ లో ఆయన ఈవో ధర్మారెడ్డితో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, సేవకుల సమిష్టి కృషితో కలియుగ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసాయన్నారు. ఇందులో భక్తుల సహకారం మరువలేనిదన్నారు. భక్తిభావంతో స్వామి వారి పల్లకిని వాహన బేరర్లు మోసారని ప్రశంసించారు. గరుడ సేవను మూడు లక్షల మంది వీక్షించారని, అదే రోజు స్వామి వారిని 81138 వేల మంది భక్తులు దర్శించుకొన్నారని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లోని హుండీ ఆదాయం రూ. 20.43 కోట్లుగా తెలిపారు. 24.89 లక్షల లడ్డూలు విక్రయించిన్నట్లు పేర్కొన్నారు. 20.99 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారన్నారు. 2.20 లక్షల మంది భక్తులు తలనీలాల మొక్కులు సమర్పించుకొన్నారని ఆయన తెలిపారు.
హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 7 రాష్ట్రాల నుండి వచ్చిన 91 కళాబృందాల ద్వారా 1906 మంది కళాకారులు ప్రదర్శించిన కళాకృతులు భక్తులను అశేషంగా ఆకట్టుకొన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలకు స్వామి వారి ఉచిత దర్శనం కల్పించే క్రమంలో 147 బస్సుల ద్వారా 6997 వేల మంది భక్తులకు బ్రహ్మోత్సవ దర్శనాలను అందించిన్నట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: నేడు శుభ, అశుభ శుభ ముహుర్త సమయాలు ఇవే