Home / తప్పక చదవాలి
ఆంధ్రప్రదేశ్ శాసన సభ , పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఇప్పటి వరుకు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన అధికారులు రాజీనామా లు చేసే పనిలో పడ్డారు .కొంత మంది సెలవలు పెడుతున్నారు .
ఇంతకాలం గ్లాస్ గుర్తు పై వివాదం నెలకొంది .2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందే స్థాయిలో విజయం సాధించలేదు .దింతో గాజు గ్లాస్ గుర్తు జనరల్ కేటగిరీ లో ఉంచింది ఎన్నికల సంఘం .
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగింది. రెండు పార్టీలు చెరో 8 సీట్లను గెలుచుకోగా మజ్టిస్ హైదరాబాద్ సీటును నిలుపుకుంది. రెండు పార్టీలకు గత పార్లమెంటు ఎన్నికల్లో పోల్చినపుడు సీట్లు పెరగడం విశేషం. మరోవైపు పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారం చలాయించిన బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది.
ఏపీకి చీకటి రోజులు ముగిశాయని, ఇది ఏపీ భవిష్యత్‌కు బలమైన పునాది వేసే సమయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఆశ్చార్యాన్ని కలిగించాయని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఎంతో చేసినా వారి ప్రేమలు ఏమయ్యాయో తెలియలేదన్నారు. ఏపీ ప్రజలకోసం ఎంతో చేయాలని తాపత్రయ పడ్డాం.
ఏపీ అసెంబ్టీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ దుమ్మురేపింది. జనసేన పార్టీ పోటీ చేసిన 21 సీట్లను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు కూడా జనసేన ఈ స్దాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఊహించలేదు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలు తారుమారు చేసాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలకు, కార్యకర్తలకు పార్టీ పరాజయం మింగుడు పడటం లేదు. తమ పార్టీ అమలు చేసిన సంక్షేమ పధకాలతో ప్రతీ కుటుంబం లబ్దిపొందిందని అందువలన గతంలో వచ్చిన సీట్లు రాకపోయినా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్మారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి దూసుకు పోతోంది. అధికార వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనబడడంలేదు .ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం సీట్లల్లో 10 శాతం గెలవాలి.ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు వున్నాయి
ఏపీ లో ప్రజల నాడీ ఏ సర్వే సంస్థలకు చిక్కలేదు మిశ్రమ ఫలితాలను అందించాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ .కొన్ని ఏకపక్షంగా వైసీపీ కి అనుకూలంగా ఉంటే ,మరి కొన్ని సంస్థలు కూటమికి అనుకూలంగా ఫలితాలు వుంటాయని ప్రకటించాయి