Home / తప్పక చదవాలి
బాలీవుడ్ నటి రవీనా టాండన్‌పై ఆమె ఇంటి వద్ద ఓ పెద్ద గుంపు దాడికి తెగబడింది. తనను కొట్టవద్దని ఆమె వేడుకోవడం వీడియోలో వినిపించింది. ఆ వీడియో క్లిప్‌లో రవీనా టాండన్‌పై కొంత మంది మహిళలు దాడి చేయడం కనిపించింది.
ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియా కూటమి తేలికగా కొట్టిపారేసింది. 2024 లోకసభ ఎన్నికలల్లో ప్రస్తుతం వస్తున్న ఎగ్జిట్‌పోల్స్‌కు పూర్తిగా వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయని ప్రతిపక్ష పార్టీ భావిస్తోంది. కాగా దేశంలోని పలు చానల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్నీ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘనవిజయం సాధిస్తుందని అంచనా వేశాయి.
దేశంలో ఏడవ విడత పోలింగ్ ముగిసిన వెంటనే పాల ధరకు రెక్కలు వచ్చాయి. దేశంలోని అతి పెద్ద మిల్క్ కో ఆపరేటివ్‌లు అమూల్, మథర్‌డెయిరీలు వరుసగా లీటరుకు రూ.2 చొప్పున జూన్ 3 నుంచి పెంచేశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా సోమవారం నాడు దూసుకుపోయాయి. కేంద్రంలో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వం సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దాదాపు అన్నీ ఎగ్జిట్‌పోల్స్ చెప్పడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేశారు.
Actress Hema Arrested: రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమాను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో రేవ్ పార్టీ సంచలనం సృష్టించింది. ఈ పార్టీలో పలువురు ఏపీకి చెందిన వారు ఉన్నారని వార్తలు వచ్చాయి. నటి హేమ కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి.
రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది . జిల్లాలోని రాయచోటిలో ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.
విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది . విహారయాత్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సముద్రుని రాక్షస ఆలా మృత్యువు రూపంలో దూసుకువచ్చి అక్కా చెల్లెళ్లను బలి తీసుకుంది. తమ విహార యాత్ర జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి తీరాన్ని ఆనుకొని ఉన్న కొండరాళ్లపై నిలుచుని ఫొటో తీసుకోవడానికి వెళ్లిన అక్క చెల్లెళ్ళ ను వేగంగా దూసుకొచ్చిన అల బలి తీసుకుంది.
శ్రీలంకను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు కూలిపడ్డంతో సుమారు 15 మందిమృతి చెందారని శ్రీలంక డిజాస్టర్ సెంటర్ ఆదివారం వెల్లడించింది. భారీ వరదలకు దేశ రాజధాని కొలంబోలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు నీట మునిగిపోయారు.
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన వెంటనే ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డాయి. తాజాగా వారి సరసన మాల్దీవ్స్‌కూడా జత చేరింది. ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి అనుమతించమని తేల్చేసింది. దీనికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా గట్టిగానే స్పందించింది. తమ పౌరులను మాల్దీవ్స్ బదులు ఇండియాలోని లక్ష్యదీప్కు వెళ్లాలని సూచించింది.
ఇటీవల కాలంలో అమెరికాలో ఇండియన్స్ స్టూడెంట్స్ మిస్సింగ్ కేసులు విపరీంగా పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్లి నితీషా కందులా మే 28 నుంచి కనిపించకుండా పోయారు. కాగా ఆమె కాలిఫోర్నియా యూనివర్శిటీ సాన్ బెర్నారిడో స్టూడెంట్. ఆమె ఆచూకీకి సహకరించవలసింది పోలీసులు కూడా కోరారు