Home / తప్పక చదవాలి
తల్లి మీద ఉన్న ప్రేమతో ఓ కూతురు ఏకంగా చంద్ర మండలంపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసింది. చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన తల్లిపై మమకారంతో చంద్రుడిపై స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించి, మదర్స్ డే సందర్భంగా తల్లికి గిఫ్ట్ ఇచ్చింది.
జార్ఖండ్‌లోని రాంచీలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆమె స్కూల్ టీచర్ అత్యాచారానికి పాల్పడి దానిని చిత్రీకరించి, వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. సమీద్ కశ్యప్ అనే నిందితుడు బాధితురాలిని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తన కుమార్తె వివాహాన్ని ఊటీలో నిర్వహించిన 18 నెలల తర్వాత, వేడుకలకు నిధుల వినియోగంపై వివాదం చెలరేగింది.బుధవారం, డిఎంకె ఎంపి దయానిధి మారన్, గత ఏడాది ఫిబ్రవరిలో ఊటీ రాజ్‌భవన్‌లో రవి "కుటుంబ వేడుక" కోసం ప్రభుత్వ డబ్బును ఉపయోగించారని ఆరోపించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న (ఆదివారం) తెలంగాణ పర్యటనకు రానున్నారు. అదే రోజు సాయంత్రం ఖమ్మం లో జరిగే బీజేపీ రైతు సభ లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్శిటీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న గిరిజనులకు సర్వదా రుణ పడి ఉంటానని అన్నారు. రూ.830 కోట్లతో నిర్మిస్తున్న యూనివర్శిటీకి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.
చైనా భారత్ భూమిని ఆక్రమించుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ మరోసారి ఆరోపించారు. శుక్రవారం లడఖ్‌లోని కార్గిల్‌లో ఆయన మాట్లాడుతూ లడఖ్‌లో ఒక్క అంగుళం కూడా చైనా స్వాధీనం చేసుకోలేదని విపక్షాల సమావేశంలో ప్రధాని అనడం బాధాకరం.. ఇది అబద్ధం అని వ్యాఖ్యానించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం (ఆగస్టు 24) జార్జియాలో 2020 ఎన్నికలను తారుమారు చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై లొంగిపోయారు, 20 నిమిషాల అనంతరం మగ్ షాట్ ( ఫోటో) తరువాత ట్రంప్ 200,000 డాలర్ల బాండ్‌పై విడుదల చేయబడ్డారు. అనంతరం అతను న్యూజెర్సీకి తిరిగి వచ్చే విమానం కోసం విమానాశ్రయానికి తిరిగి వెళ్ళాడు.
శాంసంగ్ గురువారం ఒడిస్సీ నియో G9 56-అంగుళాల కర్వ్డ్ గేమింగ్ మానిటర్‌ను రూ. 225,000 వద్ద భారతదేశంలో విడుదల చేసింది. మానిటర్‌ను 1000R వంపుతో 57-అంగుళాల స్క్రీన్ ఫుట్‌ప్రింట్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోని మొట్టమొదటి డ్యూయల్ UHD డిస్ప్లేగా కంపెనీ పేర్కొంది. మానిటర్ డిస్ప్లేపోర్ట్ 2.1 ఇన్పుట్, 240Hz రిఫ్రెష్ రేట్ మరియు 1ms ప్రతిస్పందన సమయాన్ని కలిగి ఉంది.
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా దుమ్ము రేపింది. జాతీయ ఉత్తమనటుడుగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. పుష్ప: ది రైజ్ చిత్రానికి గాను అల్లు అర్జున్ కు ఈ అవార్డు దక్కింది. గంగూబాయి కతియావాడి మరియు మిమీ చిత్రాల్లో నటనకు గాను అలియా భట్ మరియు కృతి సనన్ ఉత్తమ నటి అవార్డును పంచుకున్నారు
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు పేర్కొంది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది.