Home / తప్పక చదవాలి
భారతదేశం యొక్క మూన్ మిషన్ చంద్రయాన్-3 చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం దగ్గర విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. దీనితో చంద్రునిపై నీటి జాడలు కనుగొనబడినప్పటి నుండి దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది.
ఢిల్లీ విమానాశ్రయంలో బుధవారం పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలకు ఒకేసారి టేకాఫ్ మరియు ల్యాండింగ్ కోసం అనుమతి ఇవ్వడంతో ఈ ఘటన చోటు చేసుకుందివిస్తారా ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ కోసం అనుమతి ఇవ్వబడింది. మరొకటి ల్యాండింగ్ ప్రక్రియలో ఉంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత, టేకాఫ్ నిలిపివేయబడింది.
చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి సూచించారు. ఈ మిషన్‌ను మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలు మరియు ఇస్రోను ఆయన అభినందించారు.
మంగళవారం తెల్లవారుజామున సెంట్రల్ మెక్సికోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మెక్సికన్లు మరియు ఒక వెనిజులాన్ మరణించినట్లు మెక్సికో యొక్క ఐఎన్ఎం మైగ్రేషన్ ఇన్స్టిట్యూట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి బుధవారం డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని కలిసారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ తన తుది గమ్యాన్ని నేడు ముద్దాడనుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన తుదిఘట్టం ఇవాళ ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ అడుగు పెట్టనుంది. నేడు సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
మిజోరంలోని సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో బుధవారం కనీసం 17 మంది కార్మికులు మరణించారు.ఐజ్వాల్‌కు 21 కిమీ దూరంలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం కేసును రాచకొండ పోలీసులు చేధించారు. దీనికి సంబంధించి వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహన్ మీడియాకు వెల్లడించారు.మీర్ పేట్ మైనర్ బాలిక పై హత్యాచారం చేసిన కేసు లో ఆరుగురిని ఆరెస్ట్ చేసామనిమరొక వ్యక్తి పరార్ లో ఉన్నాడని తెలిపారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి నందన వనం లో ఈ సంఘటన జరిగింది..
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కకపోవడంతో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీరు పెట్టారు. అనుచరుల ముందు బోరున విలపించారు. వరంగల్ అంబేద్కర్ విగ్రహం ముందు పడుకుని ఏడ్చారు. వర్షంలో తడుస్తూ కాసేపు మౌనదీక్ష చేపట్టారు.రాజయ్యను చూసి కార్యకర్తలు కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్ గీసిన గీత దాటనని రాజయ్య తెలిపారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. తనను హత్య చేయడానికి లోకేష్ కుట్ర పన్నుతున్నారని.. కోర్టుకు హాజరయ్యేటప్పుడు తనను చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.