Home / తప్పక చదవాలి
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం నుంచి పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చలనచిత్రాలలో కల్కి 2898 AD ఒకటి. ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది. విడుదలకు ముందే మరే ఇతర భారతీయ చిత్రాలకు లేని సరికొత్త రికార్డులను కల్కి నెలకొల్పుతోంది.
ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాషింగ్టన్‌లోని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఆరడుగుల మైనపు విగ్రహం కరిగిపోయింది. క్యాంప్ బార్కర్ లో ఉన్న ఈ విగ్రహం తల ఎండ వేడికి ముందుగా విగ్రహం తల, తరువాత కాళ్లు కరిగిపోయాయి.
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే దశాబ్ద కాలం పాటు న్యాయ పోరాటం తర్వాత బుధవారం తన స్వదేశం ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు, గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లూ బ్రిటన్‌లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పిచ్చింది
హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. గతంతో పోలిస్తే.. మెట్రో ప్రయాణాలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు, కామన్ పీపుల్స్ అంతా సిటీలోని ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లేవాళ్లకి మెట్రో ట్రైన్స్ మంచి ఆప్షన్‌గా నిలుస్తున్నాయి.
తెలంగాణలో తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన జూనియర్ డాక్టర్లు రెండుగా చీలిపోయారు. నిన్న అర్ధరాత్రి వరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించగా.. ఉస్మానియా జూనియర్ డాక్టర్లు మాత్రం సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు.
బుర్కినా ఫాసోతో ఉన్న సరిహద్దు సమీపంలో ఉగ్రవాద బృందంఆకస్మికంగా దాడి చేసి 21 మంది నైజీరియన్ సైనికులను చంపినట్లు నైజర్ పాలక మిలిటరీ జుంటా ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం జరిగిన ఈ దాడి వెనుక ఏ గ్రూపు ఉందో పేర్కొనలేదు.
18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణీ ఓటుతో ఆయన ప్రతిపక్ష కూటమి అభ్యర్ది కె. సురేష్ పై గెలుపొందినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తీసుకుని వెళ్లారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అధికారులు కార్పొరేషన్ యొక్క ప్రత్యేకమైన వాహన ట్రాకింగ్ సిస్టమ్ నెట్‌వర్క్‌లోని ‘TGSRTC గమ్యం యాప్’లో అన్ని లగ్జరీ, ఎయిర్ కండిషన్డ్ మరియు ఎలక్ట్రిక్ బస్సులను చేర్చే ప్రక్రియను వేగవంతం చేశారు
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 26 నుండి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను ప్రారంభించనున్నారు. ఈ సమయంలో పవన్ పాలు, పండ్లు మరియు ద్రవాలతో కూడిన ఆహారం మాత్రమే తీసుకుంటారు.