Home / తప్పక చదవాలి
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌కు అవకాశాం ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వొక్కలిగ మఠం పీఠాదిపతి చంద్రశేఖర స్వామిజీ అభ్యర్థించారు. ఒక కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్యతో వేదిక పంచుకున్న సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు
లోక్‌సభలో స్పీకర్ కుర్చీ పక్కన ఏర్పాటు చేసిన 'సెంగోల్' ఔచిత్యాన్ని సమాజ్ వాదీ పార్టీకి చెందని ఎంపీ ప్రశ్నించడంతో బీజేపీ ఎదురుదాడికి దిగింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్కె చౌదరి స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో 5 అడుగుల పొడవున్నబంగారు పూతతో కూడిన 'సెంగోల్' స్దానంలో రాజ్యాంగ ప్రతిని తప్పనిసరిగా ఉంచాలని అన్నారు.
ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తి 30 సంవత్సరాలకు పైగా ఎక్కువగా ధూమపానం చేయడంతో అతని శరీరంలో అసాధారణ పరిస్దితి తలెత్తింది. అతని గొంతు లోపల వెంట్రుకలు పెరిగాయి. 2007లో అతను దీర్ఘకాలిక దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, బొంగురుస్వరం వంటి ఫిర్యాదులతో వైద్యుడి వద్దకు వెళ్లాడు.
బీహార్‌లో నీట్-యుజి పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం , పాట్నాకు చెందిన మనీష్ ప్రకాష్ మరియు అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మొదటి అరెస్టులు ఇవే కావడం గమనార్హం.
:కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న నటి పవిత్ర గౌడ పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు మేకప్ ధరించి కనిపించడం సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు బుధవారం మహిళా సబ్ ఇన్స్పెక్టర్కు నోటీసు జారీ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం.. దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించడంతో.. ఆయన్ను ఇవాళ ఉదయమే జైలుకు తరలించారు.
నేపాల్‌లో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగులు పడటంతో 14 మంది మరణించారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్‌డిఆర్‌ఎంఎ) ప్రకారం, కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు మరియు వరదల కారణంగా ఒకరు మరణించారు.
తెలంగాణలో ఎన్నికల హడావుడి మిగియడంతో ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. అందులో భాగంగా పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
కెన్యాలో మంగళవారం జరిగిన నిరసనల్లో కనీసం 13 మంది మరణించారని ఆ దేశ ప్రధాన వైద్యుల సంఘం అధికారి తెలిపారు.నైరోబీ మరియు దేశంలోని ఇతర నగరాల్లో పోలీసులు మరియు నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల మధ్య కెన్యా పార్లమెంటు మంగళవారం పన్నులను పెంచే వివాదాస్పద ఆర్థిక బిల్లును ఆమోదించింది.