Home / తప్పక చదవాలి
18వ లోక్ సభకు ఎన్నికయిన పార్లమెంటు సభ్యుల ప్రమాణస్వీకారం నేడు జరిగింది. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేసారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్ సినీ నిర్మాతలు కలిశారు. నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, యెర్నేని నవీన్, రవిశంకర్, డీవీవీ దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంపు ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు.
సోమవారం సుమారుగా మూడు గంటల పాటు చర్చించిన ఏపీ కేబినేట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన కేబినెట్.. అన్నిటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మరణించగా నలుగురు గాయపడ్డారు. ఈ సందర్బంగా 15 మంది తప్పిపోయినట్లు యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను ముంబైలో సోమవారం సన్నిహితుల సమక్షంలో పెళ్లాడింది. పెళ్లి సందర్బంగా సోనాక్షి సిన్హా పెద్ద బ్రాండ్లు, డిజైనర్ వేర్లన్నింటినీ వదిలేసి తన తల్లి పెళ్లి చీరను ఎంచుకుంది
తెలంగాణ ప్రభుత్వం సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ (జిహెచ్ఎంసి) రోనాల్డ్ రోస్తో సహా తెలంగాణలోని పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. గత కొద్ది రోజులకిందట పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా ఆపుడు ఏకంగా 44 మంది అధికారులను బదిలీ చేయడం విశేషం.
18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ సభ్యునిగా మోదీ ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి.వరుసగా మూడవసారి ఎన్డీఏ కూటమి గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టిన విషయం తెలిసందే. ఈ నేపధ్యంలో మోదీ, మంత్రులు ఈ నెల జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధమే హత్యకు దారితీసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది. 42ఏళ్ల మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను నిందితులు చంపేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో చంపి పాతి పెట్టినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం.
రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో 15 మందికి పైగా పోలీసు అధికారులు, మతగురువుతో సహా పలువురు పౌరులు సాయుధ మిలిటెంట్ల చేతిలో హతమయ్యారు. ముష్కరులు రెండు నగరాల్లోని రెండు చర్చిలు, ఒక ప్రార్థనా మందిరం, ఒక పోలీసు పోస్ట్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మధ్య శనివారం నాడు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య రక్షణ రంగంతో పాటు రక్షణ ఉత్పత్తులు, కౌంటర్ టెర్రరిజానికి సంబంధించిన అంశాల్లో ఒకరి కొకరు సహాయం చేసుకోవడంతో పాటు సరిహద్దు అంశాల గురించి న్యూఢిల్లీలో వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి