Home / తప్పక చదవాలి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం పంజాబ్లోని అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ప్రార్థనలు చేసి స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ ప్రస్తుతం వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. రాహుల్ ప్రైవసీని గౌరవించాలని పార్టీనేతలు కార్యకర్తలకు చెప్పారు.
బీహార్ ప్రభుత్వం తన వివాదాస్పద కుల ఆధారిత సర్వే వివరాలను సోమవారం వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) 63 శాతం ఉన్నారని జనాభా గణన వెల్లడించింది. బీహార్ జాతి అధారిత్ గణన అని కూడా పిలిచే ఈ జనాభా లెక్కల ప్రకారం 13 కోట్ల జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 19 శాతానికి పైగా ఉండగా, షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతంగా ఉన్నాయి.
కోవిడ్-19కి వ్యతిరేకంగా mRNA వ్యాక్సిన్ల అభివృద్ధిలో విప్లవాత్మక కృషి చేసినందుకు శాస్త్రవేత్తలు కాటలిన్ కారికో మరియు డ్రూ వీస్మాన్లకు 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతి లభించింది.వీస్మాన్ మరియు కారికో యొక్క పరిశోధనలు 'ఎంఆర్ఎన్ఎ మన రోగనిరోధక వ్యవస్థతో ఎలా సంకర్షణ చెందుతుందనే దానిపై మన అవగాహనను ప్రాథమికంగా మార్చింది అని నోబెల్ కమిటీ తెలిపింది.
దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్లో కార్గో ట్రక్కు ప్రమాదంలో 10 మంది క్యూబన్ వలసదారులు మరణించగా 17 మంది తీవ్రంగా గాయపడినట్లు మెక్సికో మైగ్రేషన్ ఇన్స్టిట్యూట్ ఆదివారం తెలిపింది. చియాపాస్లోని పిజిజియాపాన్-టోనాలా హైవే యొక్క పసిఫిక్ తీరప్రాంతం వెంబడి ఈ ప్రమాదం జరిగింది.
: నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోవడంతో మరణించిన ఆరుగురు వ్యక్తులలో భారత పారిశ్రామిక వేత్త హర్పాల్ రంధవా మరియు అతని కుమారుడు ఉన్నార జింబాబ్వే మీడియా తెలిపింది
వారాహి విజయ యాత్ర అనేది అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఉన్నది జనసైనికులు కాదని.. సైకిల్ సైనికులని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నిజంగా నిజాయితీ పరుడు అయితే.. అవినీతి పరుడైన చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేశారని ప్రశ్నించారు.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నలపాలెంలోని మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద అర్థరాత్రి 11 గంటల తరువాత తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. భారీగా పోలీసులు వారింటివద్ద మోహరించారు. బండారు సత్యనారాయణ మూర్తికి 41 ఏ నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 60 చోట్ల ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఏపీలో 40 చోట్ల, తెలంగాణాలో 20 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్నారన్న సమాచారంతో ఎన్ ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మహబూబ్నగర్లో పర్యటించిన ప్రధాని మోదీ 13వేల, 500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణకు ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలమూరు సభ సాక్షిగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తరువాత వచ్చేది జనసేన - తెలుగుదేశం ప్రభుత్వమేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి నాల్గవ విడత యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.