Home / తెలంగాణ
తాను ఇంట్లో లేని సమయంలో ఐటీ అధికారులు తన కుటుంబసభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా 400 మందికి పైగా ఐటీ అధికారులు 65 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. అయితే మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం గొత్తి కోయల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగాయి
తమకు ఆయుధాలు ఇస్తేనే డ్యూటీ చేస్తామంటూ ఫారెస్ట్ సిబ్బంది ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. అంతవరకు రేపటి నుండి విదులు బహిష్కరించాలని ఫారెస్ట్ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ థియేటర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రసాద్స్ ఐమాక్స్. సిటీలోనే పెద్ద స్క్రీన్ గా ఈ ఐమాక్స్ థియేటర్ కి పేరుంది. కాగా వీక్షకులకు మరింత పెద్దతెరపై సినిమా చూపించాలని దేశంలోనే అతి పెద్ద తెరను ప్రేక్షకులకు అందుబాటులోకి తేనున్నారు.
మంగళవారం నాడు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేశారు. అంతేకాదు అసభ్యంగా మాట్లడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ స్కూల్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గుత్తికోయల దాడిలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌ను వెంటాడి దాడి చేయడంతో చనిపోయారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. తాను రాజీనామా లేఖను పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీతో తన బంధాన్ని తెంచుకుంటున్నానని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.