Home / తెలంగాణ
హైదరాబాద్లోని కొండాపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద పీఏగా పనిచేస్తున్న దేవేంద్ర కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్నాడు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీనితో ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది.
సీఎం కేసీఆర్ తనకు పితృ సమానులని ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతానని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేయడం పై విమర్శలు వచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి నేడు హైదరాబాదులోని వైఎన్ఎం కాలేజి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కూడా అనుకున్నది చేసే రకమని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు పవన్ తగినవాడు అని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో నిన్న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరయ్యారు. కాగా ఈ నేపథ్యంలో మిగిలిన 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ నేడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు రాలేదో నేతలు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
హైదరాబాద్ సిటీలో ప్రజలకు అలర్ట్. రూల్స్ పాటించకపోతే జేబుకు చిల్లు పడక తప్పదు. ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త మార్గదర్శకాలు జారీచేశారు.
తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది పదిగంటలైనా పొగమంచు వీడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది.
మాజీ మంత్రి, మర్రి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత గెలిస్తే తమ పై పెత్తనం చేస్తుందని వారు భావించారని అందుకే వారు ఓడగొట్టారని అన్నారు.