Home / ప్రాంతీయం
పిఠాపురంలో జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకండువా అనేది జనసేన జెండా కాదని ఆయన స్పష్టం చేశారు. మంగళ వారం పిఠాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో నాగబాబు మాట్లాడారు . పవన్ వేసుకున్నారు కాబట్టే దానికి అంత పాపులారిటీ వచ్చిందన్నారు. ఈ ఎర్రకండువాని కాశీతువాలంటారని.. అది తమ చిన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నామన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఢిల్లీ లోని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. మరో ఆరు రోజులపాటు అంటే మే 20 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఏకంగా వంద శాతం పోలింగ్ నమోదైంది. తండాలో మొత్తం 210 మంది ఓటర్లు ఉండగా… తండా వాసులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అక్కడడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రస్తుతానికి ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా.. చూడని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో రాజకీయ పార్టీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
తమ గ్రామానికి రోడ్డు లేదని కొందరు ,తమ పంటకు గిట్టుబాటు ధర లేదని కొందరు ,తమ గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేదని కొందరు ఎన్నికలను బహిష్కరిస్తుంటే . మరోవైపు పోలింగ్ బూత్‌కు వెళ్లేందుకు సరైన దారిలేకపోయినా వాగులు వంకలు దాటుకుని ఓటు వేస్తున్నారు.
తమ సమస్యలు పరిష్కరించలేదన్న కారణంతో తెలంగాణలోని పలు గ్రామాల్లో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ వారు నిరసన తెలిపారు.
హైదరాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కె మాధవి లత పై కేసు నమోదైంది . పోలింగ్ బూత్ వద్ద, బురఖా ధరించిన మహిళల గుర్తింపు పత్రాలను తనిఖీ చేయడం, వారి ముసుగును తీయమని కోరడం పై ఎంఐఎం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీపై మాధవిలత తలపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయమే జనం భారీగా తరలివచ్చారు. అధికార వైసీపీ కార్యకర్తలు దాడులతో భయాందోళన కలిగిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి
ఏపీలో ఓటరు చైతన్యం పోటెత్తుతోంది. ఉదయం పదకొండు గంటలవరుకు 25 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జన సందడి నెలకొంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
షర్మిలకు సొంతగా పార్టీ పెట్టాలన్న ఆలోచన లేదు. కానీ, ప్రశాంత్ కిశోర్.. పదేపదే వచ్చి సలహాలు ఇవ్వడంతో పార్టీ పెట్టారని షర్మిల భర్త బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్య చేసారు .తాజాగా బ్రదర్ అనిల్ కుమార్.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.