Home / ప్రాంతీయం
పరాయి స్త్రీల వ్యామోహంతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ భార్య తన భర్త పై క్షణికావేశంతో కాగుతున్న వేడి నూనెను పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
టీఎస్-ఈసెట్ 2022 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం tsecet.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చని మరియు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చని తెలంగాణస్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ వెల్లడించింది.
పోలీసులకు సవాల్ విసురుతూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు ఉన్నారు. కానీ చెడ్డీ గ్యాంగ్ రూటే సపరేటు వారి పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు హడలెత్తిపోతారు. దీనికి కారణం వారు అత్యంత కిరాతంగా ప్రవర్తిస్తూ ప్రజలపై దాడులు చేసి మరీ దొంగతనాలకు పాల్పడడం.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు, చీఫ్‌విప్, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.
గత మూడురోజులుగా తెలంగాణాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
Telanganaగోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్‌పై పెట్టిన పీడీయాక్ట్‌ను సవాల్ చేస్తూ, ఆయన సతీమణి పిటీషన్ దాఖలు చేశారు. అక్రమంగా తన భర్త పై పీడీయాక్ట్ నమోదు చేశారని, దాన్ని ఎత్తేసి బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్లో కోరారు.
విశాఖపట్నం రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలకు అనుమతులు లేవని తేలితే వాటి కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
మహిళలపై అఘాయిత్యాలు రానురాను ఎక్కువవుతున్నాయా అంటే అవుననే చెప్పవచ్చు. చిన్నాపెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా ఆడవాళ్లు కనపడితే చాలు వారిపై దాడులు చేస్తున్నారు మృగాళ్లు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో మైనర్ బాలికపై సొంత మేనమామే అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. దానిని ఆ బాలిక ప్రతిఘటించింది.
కాకినాడ రూరల్ లోని వలసపాడు కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్ధులు అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైయ్యారు. 5,6 తరగతి గదుల్లో 30 మంది విద్యార్ధులు ఊపిరాడక కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ లో ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపే వారు ఇకపై జాగ్రత్తగా లేకపోతే వారి జేబుకు చిల్లు పడినట్లే. ఇకపై మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు కట్టవలసి వస్తుంది.