Home / ప్రాంతీయం
ఏపీ లోని విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి లోని సుజాతనగర్ లో బంగారం కోసం 72 ఏళ్ల వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. సుజాతనగర్ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పార్ట్ టైంగా చికెన్ షాప్ లో జాబ్ చేస్తున్నాడు.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో సి కళ్యాణ్ ప్యానెల్‌పై దిల్ రాజు ప్యానెల్ హవా కొనసాగుతోంది. నిర్మాతల రంగంలోని మొత్తం 12 సీట్లలో ఇప్పుడు ఏడు దిల్ రాజుకు చెందినవే.14 రౌండ్లలో దిల్‌రాజుకు 563 ఓట్లు రాగా సి. కల్యాణ్‌కు 497 ఓట్లు వచ్చాయి. ప్రొడ్యూసర్ సెక్టార్ మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానెల్ సభ్యులు గెలుపొందారు
దేశానికి సైనికులు ఎలాగో సమాజానికి డాక్టర్లు అలా సేవచేస్తున్నారని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని లయన్స క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అభయ బంజారా 13వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించారని అన్నారు.
హైదరాబాద్ లో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దిల్ రాజ్, సి.కళ్యాణ్ ప్యానెల్ మధ్య పోటీ జరగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. ఫిలిం ఛాంబర్ లో మొత్తం 1600 మంది సభ్యులు ఉండగా… 900 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు తెలుగు సినీ నటుడు బ్రహ్మానందం తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు. బ్రహ్మానందం కుటుంబ సభ్యుల నుంచి పెళ్లి కార్డును ఆయన సతీమణి శోభతో కలిసి ముఖ్యమంత్రి స్వీకరించారు.
ఇంతకాలం బీజేపీలో ఉన్నా పురంధేశ్వరిని పెద్దగా పట్టించుకోని వైఎస్ఆర్సిపి నేతలు ఆమె అధ్యక్షురాలైన తరువాత వరుసగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇంతకాలం ఆమె పట్ల కాస్త మర్యాదగా మాట్లాడిన ఫ్యాను పార్టీ నేతలు ఇప్పుడు డోసు పెంచారు. ఇటీవలి కాలంలో ఏపీలోని ముఖ్య పట్టణాలకి వెళుతూ మీడియా సమావేశాల్లో పురంధేశ్వరి వైఎస్ఆర్సిపిపై విరుచుకు పడుతున్నారు. అంతే ఘాటుగా వైఎస్ఆర్ మంత్రులు స్పందిస్తున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో కోళ్లు దొంగిలించారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను స్థానిక వైకాపా కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారిలో ఒక దళిత బాలుడిని కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించి.. కటింగ్‌ప్లేయర్‌తో మర్మాంగాలను నొక్కిపట్టి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. నిన్న గ్రాండ్ గా రిలీజయింది. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సితం సినిమాకు బ్రో రీమేక్‌గా వచ్చింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రేపు ఉదయం 6.30 గంటలకు PSLV C-56 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇక, దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ కు, పోలవరానికి పట్టిన శని చంద్రబాబు నాయుడేనని ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ ను నిపుణులు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు తమ హయాంలో పోలవరం పనులు 75 శాతం చేసామని చెప్పారని కాని అది అబద్దమన్నారు.