Home / ప్రాంతీయం
విశాఖపట్నంలో ఓ యువతి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో మంగళవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. స్థానిక వీఐపీ రోడ్డులో ఇన్నోవా కారును నడుపుతున్న ఆమె అతి వేగంతో ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న
ఆంధ్రప్రదేశ్‌లో బంగారు గనులు బయపడ్డాయని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. ఏపీలో 47 పాయింట్ ఒకటి ఏడు టన్నుల బంగారు నిక్షేపాలున్నాయని ప్రహ్లాద్ జోషి చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తూ సెటైర్లు వేసారు.
ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో 8 వేల మందికి ఉపాధి లభ్యం కానుందని సీఎం జగన్ చెప్పారు. నేడు విశాఖలో పర్యటించిన జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా నగరంలోని కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ కు సీఎం జగన్ భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో ఈ మాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 15 ఎకరాల్లో ఈ నిర్మాణాన్ని చేపట్టనుంది రహేజా సంస్థ మరో వైపు
తిరుమలలో నేటి నుంచి శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. కాగా ఇవాల్టి నుంచి నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నారు. దీంతో ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో
కొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్న తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆయన అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. వీటిలో ప్రధమంగా టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, మెట్రో విస్తరణ, ఎయిర్ పోర్టు అభివృద్ధి ఇలా అనేక కీలక
హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. 15 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు నివాసం, కార్యాలయంతో పాటు పలువురి నివాసాల్లో సోదాలను చేపడుతున్నట్టు సమాచారం అందుతుంది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. ప్రజా సమస్యల్ని అధికారులు, నేతలు పట్టించుకోవడం లేదని.. 20వ వార్డు టీడీపీ కౌన్సిలర్ రామరాజు చెప్పుతో కొట్టుకున్నాడు. ప్రజల సమస్యలు తీర్చలేనప్పుడు కౌన్సిలర్‌గా ఉండి ఏం లాభమని ఆవేదన వ్యక్తం చేశాడు. మరణించడం తప్ప.. తనకు వేరే మార్గం లేదని కౌన్సిలర్ రామరాజు కంటతడి పెట్టుకున్నాడు.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకి నిరసన సెగ తగిలింది. వెలగపూడిలో అంబటి రాయుడు కాన్వాయ్‌ను అమరావతి రాజధాని రైతులు అడ్డుకున్నారు. అమరావతి రాజధానికి మద్దతు తెలపాలని కోరారు. అయితే.. అది తన పరిధి కాదని అంబటి రాయుడు తెలిపారు. దీనితో రాజధాని రైతులు నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు.
ట్రంకు లైన్ పేరుతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఫ్లెక్సీ ఫొటోలపై పిండ ప్రధానం అని రాసి డ్రైనేజీ నీళ్లలో వదిలేశారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరి హయంలో అవినీతి జరిగిందనే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ దొరబాబుల నేతలు పరస్పరం సవాళ్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ నేతలు.. లై డిటెక్టర్ టెస్టు, బహిరంగ చర్చ కోసం