Home / ప్రాంతీయం
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేకుండా పోతుందన్నారు. కేశవనగర్ గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజయ్య.
తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. పాదయాత్రలతో ముందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఇక బస్సుయాత్రలను కొనసాగించాలని నిర్ణయించారు.
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలునిచ్చారు. ఇందులో భాగంగా నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి, కొవ్వొత్తులు వెలిగించాలని, సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయాలని, వాహనదారులు లైట్లు వెలిగించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఏపీలోని ప్రముఖ ఆలయాలను మూసివేయనున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని 28న రాత్రి 7.05 నుంచి తెల్లవారుజామున 3.15 వరకు ఆలయాన్ని మూసేస్తారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అక్టోబర్ 28 (2023)న సాయంత్రం 6 గంటల నుంచి 29న తెల్లవారుజామున 3.30 గంటల వరకు మూసివేయనున్నారు.
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. భాజపా నేత డికె అరుణ సమక్షంలో చికోటి ప్రవీణ్ పార్టీలో చేరగా.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయనకు కండువా కప్పారు. గత కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రవీణ్ జాయిన్ కావడాన్ని పార్టీలో ఒక వర్గం వ్యతిరేకించింది.
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జూలో ఉన్న ఓ ఏనుగు దాడి చేయడంతో ఓ ఉద్యోగి మరణించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఊహించని ఘటనలో వివరాల్లోకి వెళ్తే.. షైబాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ జూలో యానిమల్ కీపర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఏనుగు అదుపుతప్పి ప్రవర్తించడంతో షైబాజ్ మృత్యువాతపడ్డాడు.
పొత్తులపై తాము ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని ప్రజలకే చెబుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ మేము ఎన్ని చోట్ల పోటీ చేస్తాం.. ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది మీకు అనవసరమని వైసీపీ నేతలకు పరోక్షంగా సెటైర్లు వేసారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ఎసిబి కోర్టు జడ్జి హిమబిందు తీర్పుని రిజర్వ్ చేశారు. సోమవారంనాడు తీర్పు ప్రకటిస్తామని ఎసిబి కోర్టు ప్రకటించింది.
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టిన రోజు వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయారు. తన గన్మన్పై చేయి చేసుకున్నారు. శ్రీనివాస యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి మహమూద్ అలీ ఆయనకి బొకే ఇవ్వాలనుకున్నారు.
వైసీపీ నేత వేధింపులు తాళలేక టీటీడీ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను సూసైడ్ నోట్లో రాశారు. ఈ ఘటన పేరూరులో తీవ్ర కలకలం రేపింది. పేరూరుకు చెందిన మునస్వామికి స్థానికంగా కొంత వ్యవసాయ భూమి ఉంది