Home / ప్రాంతీయం
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో బిఆర్ఎస్ ఎన్నికల కసరత్తుని వేగవంతం చేసింది. ఈ నెల 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయి బి ఫారాలను అభ్యర్థులకు అందజేయనున్నారు. పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..! భారీ విజయం.. భారత రాష్ట్ర సమితిదే..! రెండు సార్లు నిండుమనసుతో ప్రజాఆశీర్వాదం..!మూడోసారి మనదే జయం..! అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా గత నెల 9 వ తేదీన ఆయనను అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటి నుంచి చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతుండడం
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత, మరింత నాణ్యమైన చికిత్స అందించేందుకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కు ప్రత్యేకంగా ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈ.హెచ్.సి.టి) ఏర్పాటు చేసి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శంషాబాద్ విమానాశ్రయం లగేజీ స్క్రీనింగ్ అధికారులు ఓ వ్యక్తి తీసుకువచ్చిన లగేజీని పరిశీలించి అవాక్కయ్యారు. క్షుద్రపూజల కోసం కస్తూరి పిల్లికి సంబంధించిన అవయవాలను అతడు తరలిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు సీఐఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. తెల్లవారు జామున సయ్యద్ అక్బర్ పాషా అనే వ్యక్తి ముంబై వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్, రీజినల్ కో ఆర్డినేటర్లు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం,మండల స్థాయి ముఖ్య నాయకులతో కలిసి 8,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మరోసారి ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ మూడు కేసుల్లోను ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టు మూడింటిని కొట్టివేసింది.
ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో రంగ్ భవన్ ఆడిటోరియంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. ఈ ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని స్థానికులు
సాధారణంగా పాలకులు ప్రజలకు ఉపయోగపడే, వారి జీవితాలను మెరుగుపరిచే నిర్ణయాలను తీసుకున్నపుడు ప్రజలు వారిపై తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటారు. వీటిలో భాగంగా ఫోటోలకు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, పూజలు చేయడం పరిపాటి. అయితే విశాఖ మహిళలు మాత్రం దీనికి భిన్నంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లిక్కర్ తో అభిషేకం చేసి తమ నిరసన చాటారు.