Home / ప్రాంతీయం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు లోనయ్యారు. గత కొన్నిరోజులుగా విపరీతమైన ఉక్కపోత, వేడిమి నెలకొని ఉండడంతో... జైల్లో చంద్రబాబు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారు. అధిక వేడిమితో ఆయన అలర్జీకి గురయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గాంధీ సిస్టమ్ కాదని.. బీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాడికి, జెండా మోసిన వాడికే ఏ స్కీమ్ అయినా దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా ఆయన ఉన్నతాధికారులను వాడు, వీడు అంటూ సంబోధించడం గమనార్హం.
కాంగ్రెస్‌లో విలీన ప్రక్రియ బెడిసి కొట్టడంతో వైఎస్ షర్మిల రూటు మార్చారు. తన సొంత పార్టీ వైఎస్ఆర్టిపి తరపునే తెలంగాణ ఎన్నికల్లో తలపడాలని వైఎస్ షర్మిల డిసైడయ్యారు. గురువారం నిర్వహించిన వైఎస్ఆర్టిపి కార్యవర్గ సమావేశంలో ఎన్నికల కార్యచరణపై నేతలు, క్యాడర్‌తో షర్మిల చర్చించారు.
హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల ఓ హోటల్ గదిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బయటికొచ్చింది. హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరి లోని కామరాజ నగర్ నివాసి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కాకినాడ జిల్లా సామర్లకోటలో పర్యటించారు. ఈ మేరకు స్థానికంగా నూతనంగా నిర్మించిన జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాని నారా లోకేష్ కలిశారు. జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ అమిత్ షాకు వివరించారు.
తన కొడుకుని మిస్సవుతున్నానంటూ మంత్రి కెటిఆర్ చేసిన ట్వీట్‌పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్.. అని ప్రశ్నించారు. కొడుకుతో కొద్ది రోజుల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా.. అని అడిగారు.
ఆర్థరైటీస్ కారణంగా యువకులలో వైకల్యం ఏర్పడుతుందని కామినేని హాస్పిటల్ సీనియర్ జాయింట్ రీప్లెస్ మెంట్ స్పెషలిస్ట్ డా. బెజవాడ పాపారావు అన్నారు. ఈ వ్యాధి సోకిన పక్షంలో చికిత్స ప్రారంభించి వ్యాధి ముదిరి వ్యక్తి కదలిక క్రమక్రమంగా తగ్గిపోతాయని అన్నారు. అలాంటి వారిలో రోజువారీ జీవితం పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు.
తెలంగాణ హైకోర్టు బుధవారం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ( ఎస్‌సిసిఎల్ )లో గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్ ఎన్నికలను డిసెంబర్ 27 కి వాయిదా వేసింది. ఎస్‌సిసిఎల్ చేసిన అప్పీల్‌ను పరిశీలించిన తర్వాత హైకోర్టు తన తీర్పును వెలువరించింది. నవంబర్ 30లోగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారయ్యింది. ఈ నెల 15న హుస్నాబాద్‌లో తొలి బహిరంగ సభ జరగనుంది. అనంతరం ఈ నెల 16 నుంచి నవంబర్ 9 వరకు పర్యటించనున్నారు.