Home / ప్రాంతీయం
రాబోయే లోక్హ సభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు తెలంగాణ బీజేపీ సన్నద్దమయింది. తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 17 పార్లమెంట్ స్థానాలకి ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని చూసి కేటీఆర్, హరీష్ రావులు భయపడుతున్నారని కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అన్నారు. గొప్ప మనసు ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఆయన్ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు.
తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయదలచుకొలేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సోమవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఫలితాలు ఎలా వుంటాయో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు.
శింగనమల ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన జొన్నలగడ్డ పద్మావతి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతాంగానికి తమ వాటా నీరు తీసుకోవాలంటే.. ప్రతిసారి ఒక రకమైన యుద్ధమే చేయాల్సి వస్తుందని ఆమె మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు ఎలా అడగాలంటూ అసహనం వ్యక్తం చేశారు.
వైఎస్ షర్మిల మొదటిసారిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఈ నెల 18న జరగనున్న తన కుమారుడి నిశ్చితార్దానికి రేవంత్ రెడ్డిని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి షర్మిలను సాదరంగా ఆహ్వనించి ముచ్చటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తన మద్దతును తెలిపారు. బుధవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ క్యాడర్‌తో తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడారు. ఫిబ్రవరి నెలనుంచి కేసీఆర్ ప్రతిరోజూ తెలంగాణ భవన్‌కి ప్రతిరోజూ వచ్చి కార్యకర్తలని కలుస్తారని హరీష్ రావు తెలిపారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ యాజమాన్యం జనసేనానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. డిసెంబర్ 14న ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కి ఓ లేఖని రాశారు. జనవరిలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ ఈవెంట్ కి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా ఆహ్వానించారు
అంగన్ వాడీలపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్ వాడీల సమ్మెని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ కార్యకర్తలపై ఎస్మాని ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నం.2ను జారీ చేసింది. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ రద్దు అయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నా అవసరం పార్టీకి లేదని భావించిన తర్వాత కూడా.తాను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.