Home / ప్రాంతీయం
పొలిటికల్ రీ ఎంట్రీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడీ అయిపోయారు. ముద్రగడతోపాటుగా ఆయన కుమారుడు కూడా పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా తండ్రీ కొడుకులు మొదలు పెట్టేశారు. నిన్న జనసేన నేతలు, ఇవాళ టిడిపి నేతలు ముద్రగడని కలవడంతో ఉభయగోదావరి జిల్లాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది.
తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డీలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో.. రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి..ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేది వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని కలిసిన తరువాత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తమ భేటీపై స్పష్టతనిస్తూ ట్వీట్ చేశారు. ఎపి ప్రజలకి సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చి వైసిపిలో చేరానని అంబటి రాయుడు తెలిపారు. తన ఆశలు, ఆశయాలు ఫలిస్తాయని అనుకున్నానని అంబటి రాయుడు చెప్పారు.
ఏపీ సీఎం జగన్‌ను కేశినేని నాని కలిశారు. క్యాంప్ ఆఫీస్‌లో జగన్‌తో నాని సమావేశమయ్యారు. నానితో పాటు క్యాంపు ఆఫీసుకు కేశినేని శ్వేత వెళ్లారు. నాని వెంట మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ అయోధ్యరాంరెడ్డి, దేవినేని అవినాష్‌లు ఉన్నారు.
ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మంగళగిరి జననసేన పార్టీ ఆఫీస్‌కి వెళ్ళారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్‌ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారా లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్లోనే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫారమ్ సైడ్ వాల్‌ను ఈ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకునే క్రమంలో.. రైలు ఒక్కసారిగా కుదుపునకు లోనవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ చర్యలకి ఉపక్రమించింది.మేడిగడ్డ రిజర్వాయర్‌పై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకి సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ జలసౌధ ఇరిగేషన్ కార్యాలయంలోని రెండు, నాలుగు అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు.
ఐదు గ్యారంటీల కోసం అప్లై చేసిన అభయహస్తం దరఖాస్తు పత్రాలు రోడ్డుపై దర్శనమిచ్చాయి. బాలానగర్ ఫ్లైఓవర్‌పై బైక్‌పై నుంచి ఫామ్స్ చిందరవందరగా పడిపోయాయి. ఎవరో ర్యాపిడో బుక్ చేస్తే తాను తీసుకెళ్తున్నానని సదరు బైకర్ తెలిపాడు. సుమారుగా 500 వరకు ఉన్న ఈ దరఖాస్తులు హయత్ నగర్ పరిధిలోనివి అని గుర్తించారు. డేటా ఎంట్రీ కోసం తీసుకెళ్తున్నట్లు సమాచారం.
ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఒప్పందంపై.. స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారో చెప్పాలని ఉత్తర్వుల్లో తెలిపింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మంగళవారం విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు.. దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల స్వీకరించడానికి.. ప్రతి పార్టీకి సమయం ఇస్తామని ఈసీ తెలిపింది.