Home / ప్రాంతీయం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. సైబర్ క్రైమ్ పోలీసులకు గవర్నర్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయినట్లు రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆమె ట్వీట్ ప్లాట్‌ఫారమ్ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని, ట్విట్టర్ సపోర్ట్ నుండి గవర్నర్‌కు కమ్యూనికేషన్ వచ్చినప్పుడు ఆమె ఖాతాలో అనుమానాస్పద కార్యాచరణ ప్రారంభమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈ మేరకు రాష్ట్రంలో 12వేల, 400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని పలు రంగాల్లో 12వేల, 400 కోట్లు పెట్టుబడులకు సంబంధించిన నాలుగు అవగాహన ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది.
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రసాదం లడ్డూను ఏర్పాటు చేసే అవకాశం సికింద్రాబాద్ మారేడ్ పల్లి వాసి నాగభూషణం రెడ్డికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ దక్కించుకుంది. ఈ మేరకు 12వందల 65 కిలోల లడ్డూను, ప్రత్యేక వాహనాన్ని అయోధ్యకు పంపించడానికి సిద్దం చేశారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ సోమవారం నుండి నిరవధికంగా మూతపడింది. దీంతో వేలాది మంది పవర్‌లూమ్స్, చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడం పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్ర పరిశ్రమ యజమానులు చెబుతున్నారు.
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. దామోదర రాజనరసింహ ఫేస్ బుక్ లో కొంతమందిబీజేపీ, టీడీపీ, తమిళనాడు లోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులు పెట్టారు. కొందరు నాయకులు దామోదరకు కాల్ చేసి విషయాన్ని చెప్పారు.
ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం వెళ్లింది. ఈ నెల 19 వరకూ ఈ సదస్సు జరగనుండగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి ఉండవల్లిలోని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతోపాటు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సోమవారం టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాని విడుదల చేసే అవకాశాలున్నాయి.
ఏపీలో అధికార వైసీపీ పార్టీకీ మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. త్వరలో జనసేనలో చేరుతున్నానని బాలశౌరి ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనకి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలశౌరి మనస్తాపంతో ఉన్నారు.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రామ్‌చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ట్రస్టు ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానించారు.