Last Updated:

Summer: వేసవి కాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు పాటించండి

Summer: వేసవికాలం వచ్చేసింది. దీంతో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు పెరగడంతో.. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవికాలంలోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత ప్రభావం మరింత పెరిగేలా ఉంది.

Summer: వేసవి కాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు పాటించండి

Summer: వేసవికాలం వచ్చేసింది. దీంతో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు పెరగడంతో.. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవికాలంలోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత ప్రభావం మరింత పెరిగేలా ఉంది. ఈ వేసవికాలంలో ఎక్కువ మంది.. వడ దెబ్బకి గురై వాంతులు,విరోచనాలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే.. వేడిమి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం.. (Summer)

వేసవి కాలం వచ్చిందంటే చాలు. చాలా మంది హాయిగా ఫీల్ అవుతారు. కొందరు అదే పనిగా ఎండలో తిరుగుతూ.. వడదెబ్బకు గురవుతారు. కొన్నిసార్లు వడదెబ్బ ప్రాణాలను సైతం తీస్తుంది. అందుకే ముందస్తుగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది. ఈ వేసవికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. ఎండ తీవ్రత నుంచి బయటపడవచ్చు. ఈ వేసవిలో సహజంగా మనిషి రోజుకు 7-8 లీటర్ల నీరు తాగాలి. నీరసంగా ఉంటే కొబ్బరి నీరు తాగడం.. నిమ్మకాయ నీళ్లు, పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు తాగిడం మంచిది. ఎండలో బయటకు వెళితే మాత్రం తప్పనిసరిగా గొడుగు తీసుకెళ్లాలి. దీనితో పాటు.. మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అలాగే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు ఉండేలా చూసుకోవాలి.

ఈ వేసవిలో శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు వెళుతుంది. దీని వలన.. త్వరగా నీరసం వస్తుంది. ఈ సమస్యను అధిగమించాలంటే.. ఎక్కువగా నీరు ఉన్న పదార్ధాలను తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వేసవిలో ఏది పడితే అది ఎక్కువ తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్ధాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ వేసవిలో ఎండలు అధికంగా ఉన్న సమయంలో.. చిన్న పిల్లలు, ముసలి వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులకు ఎండదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ.

వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించాలి

ముఖ్యంగా ఈ వేసవిలో ఆయిల్ ఫుడ్ ని వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఇంటా బయట కూడా.. ఆయిల్ ఫుడ్ ని పూర్తిగా తగ్గించడం శ్రేయస్కరం. పోషక విలువలు ఉండే ఆకు కూరలను ఎక్కువ తీసుకోవాలి. వేడి చేసే మసాలాలు తగ్గించాలి. ఉదయం తేలికపాటి పదార్ధాలను తీసుకోవాలి. వేసవిలో కొందరు అదే పనిగా టీ, కాఫీ తాగుతుంటారు. ఇది మంచిది కాదు. వీటి స్థానంలో రాగి జావ చాలా మంచిది. నీరు ఉండే ఫలాలు.. కర్భుజా, పుచ్చకాయ, ఈత కాయలు, తాటి ముంజులను ఎక్కువగా తీసుకోవాలి. శీతల పానియాలకు బదులు.. కొబ్బరి నీరు, నిమ్మకాయ నీళ్లు తీసుకోవడం ఉత్తమం.

మజ్జిగ అన్నం తీసుకోవడం.. అలాగే పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు వేసుకొని తాగడం మంచిది. ఇది పిల్లలు, పెద్దల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏసిలు, కూలర్లకు బదులు.. ఇంటి తెరలను వాడటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. కనీసం రోజుకు నాలుగు లీటర్ల మంచినీళ్లను తీసుకోవాలి. ఆహారంలో తగినంత ఉప్పు, నీరు ఉండాలి. ఎండలో బయటికి వెళ్లేవారు కళ్లద్దాలను అందుబాటులో ఉంచుకోవాలి. బయటకి వెళ్ళాలంటే సమయాన్ని ఎంచుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే బయటకు వెళ్లాలి. ఈ వేసవిలో ముఖ్యంగా పసి పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.