Last Updated:

Causes of Late Sleep: ఆలస్యంగా నిద్రపోతున్నారా? – జాగ్రత్త, ఈ విషయం తెలుసుకోండి!

Causes of Late Sleep: ఆలస్యంగా నిద్రపోతున్నారా? – జాగ్రత్త, ఈ విషయం తెలుసుకోండి!

Side effects of Late Sleep: మనిషికి ఆహారంతో పాటు సుఖమయమైన నిద్ర కూడా తప్పనిసరి. ఖచ్చితమైన ఆహార నియమాలతో పాటు టైంకి పడుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యమని నిపుణులు చేబుతున్నారు. సరైన ఆహారం లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. అయితే నిద్రలేమి వల్ల ప్రాణానికే ముంపు అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మధ్య చాలా మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. వర్క్ లైఫ్‌, నైట్స్‌ షిఫ్ట్స్‌ కారణంగా, స్మార్ట్‌ ఫోన్ల వాడకం వల్ల చాలా మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు.

అలాంటి వారి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశంలో ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు నిద్రలేమి వల్ల మనిషి జీవితకాలం కూడా పడిపోతుంది. ఆలస్యంగా నిద్రించే వారు అనారోగ్య అలవాట్ల వల్ల ముందుగానే చనిపోతారని అధ్యయనం చెబుతోంది. రాత్రి వేళ ఫోన్లు, టీవీలు ఎక్కువగా చూడటం వల్ల ఆలస్యంగా నిద్రపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లేటుగా పడుకునేవారిలో శారీరక అనారోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావితం చూపుతుంది. మరి నిద్రలేమి వల్ల వచ్చే అనారోగ్య సమ్యలేంటో చూద్దాం!

మానసిక ఆరోగ్యంపై..

లేటుగా నిద్ర పోవడం వల్ల నెక్ట్స్‌ మొత్తం మనిషిలో చాలా మార్పులు కనిపిస్తాయి. బద్దకంగా ఉంటారు. యాక్టివ్‌గా ఉండలేరు. ఆ రోజుంత కూడా పని చేయలేరు. ఇది కూడా శారీరక అనారోగ్యమే అని చెప్పాలి. నిద్ర లేకపోవడం శారీరకంగానే కాదు మానసికంగా ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. లేటుగా పడుకునేవారిలో, నిద్ర తక్కువ ఉండే వారు తరచూ ఒత్తిడికి, ఆందోళన, నిరాశకు గురవుతుంటారు. నిద్రలో మన మెదడు రోజూ జరిగే కార్యకలాపాలను ప్రాసెస్ చేస్తుంది. దీంతో ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే నిద్ర లోపం వల్ల మెదడు సరిగ్గా పనిచేయదు. ఇది మానసిక స్థితిలో మార్పులు తీసుకువస్తుంది. దీనివల్ల చీరాకు, కోపంను కలిగిస్తుంది. దీర్ఘకాలిక నిద్ర లేమి ఆందోళన లేదా డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక సమస్యలకు కారణమవుతుంది.

క్యాన్సర్

దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల రొమ్ము, పెద్దప్రేగు, అండాశయాలు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుండె జబ్బుల ప్రమాదం

నిద్ర లేకపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు సంభవించే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలో మన శరీరం రక్తపోటును నియంత్రించి, స్వీయ మరమ్మతులు చేసుకుంటుంది. దీనికి వల్ల గుండెకు రక్తం సరిగా పంప్‌ అయ్యి గుండెని ఆరోగ్యం ఉంచుతుంది. లేటు పడుకున్న, సరైన నిత్ర లేకపోవడం వల్ల రక్తపోటులో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇవి గుండె జబ్బులకు దారి తీస్తుంది. నిద్ర లేకపోతే రక్తపోటు పెరిగి గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీని ఫలితంగా అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక నిద్ర లేమి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది.

బరువు పెరగడం

సరైన నిద్ర లేకపోతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. గ్రెలిన్ (ఆకలిని ప్రేరేపించే హార్మోన్) స్థాయిలు పెరుగుతాయి. దీంతో లెప్టిన్ (ఆకలిని తగ్గించే హార్మోన్) స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల మీ ఆహారపు అలవాట్లలో మార్పు వస్తుంది. నిద్రలేమి కారణంగా గ్రెలిన్‌ స్థాయిలు పెరిగి ఫుడ్‌ క్రేవింగ్స్‌ వస్తాయి. దీనివల్ల అధిక కేలరీల ఆహారం, తీపి పదార్థాలు తినాలి అనిపిస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అదనంగా నిద్ర లేకపోవడం శరీర జీవక్రియ కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగి అది ఉబకాయానికి దారి తీస్తుంది.

రోగనిరోధక శక్తి బలహీనపడడం

నిద్ర మన శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సరైన నిద్ర లేకపోతే, శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని వల్ల జలుబు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. అదనంగా నిద్ర లేమి శరీరంలో మంటలు పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను మరింత ప్రోత్సహిస్తుంది.

జ్ఞాపకశక్తి, దృష్టి తగ్గడం

మన మెదడుకు నిద్ర చాలా ముఖ్యం. ఇది జ్ఞాపకశక్తిని, అభ్యాస సామర్థ్యాన్ని, ఏకాగ్రతను కాపాడటానికి సహాయపడుతుంది. నిద్ర లేకపోతే, మెదడు పనిచేయడం నెమ్మది అవుతుంది. దీని వలన జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో కష్టపడతారు. నిద్ర లేమి అనేక ఇతర సామర్థ్యాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం. ఇది రోజు రోజూ చేసే పనుల్లో తప్పుల్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి: