Home / తాజా వార్తలు
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడం.. ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్‌ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. గాజాను నేల మట్టం చేసింది. అయితే తాజా పరిణామాల విషయానికి వస్తే ప్రపంచంలోని పలు దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడానికి ముందుకు వచ్చాయి.
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఆయన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థాన తిరస్కరించింది.
కర్నూలు జిల్లా ఆదోని పరిసర గ్రామాల్లో కొందరు గంజాయి సాగు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటకలోని బళ్లారిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు.
ఏపీలో ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం అత్యవసరంగా రూ.203 కోట్లు విడుదల చేసింది. పాత బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రులు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ఏపీలో పదవతరగతి ,ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఒక సరి జరగనున్నాయి . రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను కూడా ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
నిజాలు నిలకడ మీద తెలుస్తాయని సామెత .ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలు ఈ సామెతను నిజం చేస్తున్నాయి . పోలింగ్ రోజు జరిగిన ఘటనలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గం లో పోలింగ్ రోజు అనేక ఘర్షణ పూరిత ఘటనలు చోటుచేసుకున్నాయి
నైజీరియాలో దారుణంగా చోటు చేసుకుంది. ఉత్తర మధ్య పీఠభూమిలో జురాక్ గ్రామంలో తుపాకీ ధరించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 40 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు.
ఉమామహేశ్వరరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఉమా మహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉమా మహేశ్వరరావుకు సంబంధించిన 17 ప్రాపర్టీలను అధికారులు గుర్తించారు. శామీర్ పేటలో ఒక విల్లా, ఘట్ కేసర్లో 5 ప్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకు విఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ద్విచక్ర వాహన దిగ్గజం హీరోమోటో కార్ప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో కొత్త రకం మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. కొత్త మోడల్ ధర విషయానికి వస్తే లక్షల రూపాయల కంటే తక్కువ రేటుకు విక్రయించనున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.