Home / తాజా వార్తలు
ఈ మధ్య విహార యాత్రలు విషాదంగా మారడం జరుగుతూవున్నాయి .అట విడుపు కోసం నదులు,సముద్రాలూ,జలపాతాలలో స్నానానికి వెళ్లి మృత్య వడిలోకి జారుకుంటున్నారు .తాజాగా విజయ నగరం జిల్లా జామి మండలం జాగారం వాటర్ ఫాల్స్ వద్ద ముగ్గురు యువకులు వాటర్ ఫాల్స్ లో పడి మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది .
విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీ విమానం ఎయిర్ బస్ 340 వచ్చింది.ఏపీ హజ్ యాత్రికులను తీసుకువెళ్లేందుకు ఆ విమానం వచ్చింది . ఈ భారీ విమానానికి వాటర్ కానన్ తో ఎయిర్పోర్ట్ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ మీద వున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కి మరో ఊరట లభించింది .మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది . దీనికి కూడా గతంలో విధించిన షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప డయాగ్నోస్టిక్ సెంటర్ లో టెస్టుల కోసం వచ్చిన మహిళల న్యూడ్ వీడియోలు చిత్రీకరించారు. స్కానింగ్ పేరుతో రహస్య కెమెరాలతో మహిళల నగ్న వీడియోలు రికార్డు చేశాడు స్కానింగ్ ఆపరేటర్. ఇప్పటికే వందలాది వీడియోలు తీసినట్లు తేలింది.
కృష్ణా జిల్లా పెడన రైతులను అధికారులు నట్టేట ముంచారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి అసలు బాధిత రైతులకు బదులు ఇతరుల ఖాతాల్లో పంట నష్టపరిహారం డబ్బులను జమ చేశారు. రైతులను నిండా ముంచిన ఈ వ్యవహారం తాజాగా బట్టబయలైంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను మెగాస్టార్ అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని చిరంజీవికి కూడా అందించింది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో కొండచరియలు విరిగి పడి సుమారు పది మంది మృతి చెందారు. జాతీయ రహదారి 6పై హంతూరు వద్ద రోడ్డుపై పెద్ద ఎత్తున బండ రాళ్లు పడ్డంతో జాతీయ రహదారి ధ్వంసం అయ్యింది.
హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన బిల్డర్ కుప్పాల మధు (48) కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 24న చింతల్ లో అదశ్యమయిన మధు బీదర్ లో హత్యకు గురయ్యారు. మధు దగ్గర ఉన్న ఐదు లక్షల రూపాయల నగదు, విలువైన అభరణాలు మాయం అయినట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి రాధాకిషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. గతంలో బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్‌ను ప్రభాకర్ రావు ట్యాప్ చేశాడు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌గాంధీకి బిహార్ ఎన్నికల ర్యాలీలో చేదు అనుభవం ఎదురైంది. బిహార్‌లోని పాలీగంజ్‌లో సోమవారం ఇండియా కూటమి ర్యాలీలో స్టేజ్‌లో కొంత భాగం కూలింది. కాగా స్టేజీపై రాహుల్‌గాంధీతో పాటు రాష్ర్టీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఉన్నారు.