Home / తాజా వార్తలు
మార్కెట్ ఎనలిస్టుల అంచనాలను తారుమారు చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నాలుగ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ ఏకంగా 7.8 శాతం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికిచూస్తే జీడీపీ 8.2 శాతం నమోద్యే అవకాశం ఉందని కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా వేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ నేరుగా కన్యాకుమారి వెళ్లారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్‌లో రెండు రోజుల పాటు ఆయన ధ్యానం చేస్తున్నారు.
మాజీ అమెరికాప్రెసిడెంట్ చిక్కుల్లో పడ్డారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి ఓ దేశాధ్యక్షుడు చేసిన నేరానికి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు డొనాల్డ్ ట్రంప్. న్యూయార్కు కోర్టు ఆయనను 34 కౌంట్లలో దోషిగా నిర్ధారించింది.
ఏపీలో ఎండల తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు ఎక్కువ సమయాన్ని ఇళ్ళల్లోనే గడుపుతున్నారు .పైగా చల్లదనం కోసం ఏసీలు ఎక్కువగా వాడుతున్నారు . దింతో విద్యుత్ వినియోగం పెరిగింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది . పోస్టల్ ఓట్లలో సంతకం,సీల్ లేకపోయినా ఓట్లు చెల్లుతాయన్న గతంలో సీఈఓ ముకేశ్ కుమార్ మీనా చెప్పిన సంగతి తెలిసిందే .
: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా మరోసారి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రం పదేళ్లు తాత్సారం చేసి వందలాది మంది ఆత్మబలిదానానికి కారణం ఎవరు?
బంగారాన్ని తన శరీర రహస్య భాగాల్లో దాచుకుని స్మగ్లింగ్ చేసిన ఒక ఎయిర్‌హోస్టెస్‌ను కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో ఎయిర్ హోస్టెస్‌ను అరెస్టు చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) శుక్రవారం తెలిపింది. దీనికి సంబందించి డిఆర్ఐ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఆయనకు ఇచ్చిన బెయిల్ శనివారంతో ముగిసిపోతుంది. ఆదివారం అంటే జూన్ 2వ తేదీన ఆయన తిరిగి తిహార్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ట్విట్టర్లో ఒక ఏమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. వైసీపీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు సజ్జల పై కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.