Harish Rao: డబుల్ టంగ్ లీడర్ చాలా డేంజర్.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
Harish Rao Press Meet in Praja Bhavan: డబుల్ టంగ్ లీడర్ చాలా డేంజర్ అని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో ఎన్నో మాటలు మార్చారన్నారు. రెండు నాల్కల ధోరణి ప్రమాదమని హరీష్ రావు అన్నారు. మాట మార్చడంలో రేవంత్ రెడ్డి పీహెచ్‌డీ చేశారన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఉన్న రైతు బంధునే ఇవ్వట్లేదన్నారు. రైతు, కౌలు రైతు ఇద్దరూ మాట్లాడుకోవాలని సీఎంతో పాటు మంత్రి కూడా అంటున్నారన్నారు. అయితే గతంలో మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారని, కానీ ఇప్పుడు ఒక్క పంటకు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా అమలుచేయలేకపోయారన్నారు. రైతులతో పాటు కౌలు రైతులకు సైతం రైతు బంధు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం పదవిలో ఉంటూ రైతు, కౌలు రైతులు మాట్లాడుతకోవాలని అనడం ఎంతవరకు సమంజసమన్నారు.
బీఆర్ఎస్ హయంలో ఇస్తున్న బతుకమ్మ చీరలు ఇవ్వకండా మహిళలను మోసం చేసిందన్నారు. దీంతో పాటు ఎల్ఆర్ఎస్ విషయంలో ఆనాడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆరోపణలు చేశారన్నారు.
మరి పేదల కోసం సీఎం కుర్చీలో ఉన్న నువ్వు.. ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా చేయించాలని సూచించారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మేము చెప్పే మాటలను రివర్స్ గా క్రియేట్ చేస్తున్నారన్నారు. కాగా, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మాట్లాడిన మాటలను తిరిగి ప్లే చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఒకలా.. ప్రస్తుతం సీఎం హోదాలు ఉండి కూడా మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణి.
👉 పూటకో మాట మాట్లాడటం, మాట మార్చడంలో PhD పూర్తి చేసిన రేవంత్ రెడ్డి
👉 రేవంత్ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రేవంత్ రెండు నాల్కల ఆణిముత్యాలు విడుదల చేసిన మాజీ మంత్రి శ్రీ @BRSHarish గారు
✳️ Thread on Revanth Reddy Double Standards 👇
1)… pic.twitter.com/a3D9o67JRM
— Office of Harish Rao (@HarishRaoOffice) December 2, 2024