Last Updated:

Elon Musk: మెదడులో చిప్‌.. మస్క్‌ మరో సంచలనం

మెదడులోని ఆలోచించనలతోనే పనులు చెయ్యగలిగితే ఎలా ఉంటుందంటారు. కలగా ఉండే ఈ ఆలచనలకు ప్రాణం పోస్తున్నారు స్పేస్‌ఎక్స్‌, న్యూరాలింక్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌. కూర్చున్న చోటునుంచే ఎలాంటి కదలికలు లేకుండా మెదడు ద్వారానే ఆపరేట్‌ చేయగలిగే చిప్‌ను అభివృద్ధి చేసినట్టు ఆయన వెల్లడించారు.

Elon Musk: మెదడులో చిప్‌.. మస్క్‌ మరో సంచలనం

Elon Musk: మెదడులోని ఆలోచించనలతోనే పనులు చెయ్యగలిగితే ఎలా ఉంటుందంటారు. అలా ఎలా ఇలాంటివన్నీ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లోనే జరుగుతాయి నిజజీవితంలో జరగవు అనుకుంటున్నారా. కాదండోయ్ ఇకపై ఇవ్వన్నీ మన జీవితంలో కూడా సాధ్యమే.

కలగా ఉండే ఈ ఆలచనలకు ప్రాణం పోస్తున్నారు స్పేస్‌ఎక్స్‌, న్యూరాలింక్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌. కూర్చున్న చోటునుంచే ఎలాంటి కదలికలు లేకుండా మెదడు ద్వారానే ఆపరేట్‌ చేయగలిగే చిప్‌ను అభివృద్ధి చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆ చిప్‌ను మెదడులో అమర్చితే చాలు.. ఆలోచనలు ఆదేశాలుగా మారి పనులు జరిగిపోతాయని ఆయన వెల్లడించారు. కాలిఫోర్నియాలోని న్యూరాలింక్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో మస్క్‌ ‘బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (బీసీఐ)’ సాంకేతికత వివరాలను తెలిపారు.

ఈ టెక్నాలజీని మరో ఆరు నెలల్లో మనిషిపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. దీని కోసం అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)కు సమర్పించే పత్రాలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా మనిషి మెదడులో ప్రవేశపెట్టబోయే చిప్‌తో పాటు, దాన్ని అమర్చే రోబోను కూడా పరిచయం చేశారు. మెదడుతో పాటు ఇతర శరీర భాగాల్లోనూ చిప్‌ను అమర్చేలా న్యూరాలింక్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని పక్షవాతంతో బాధపడుతున్నవారిలో దెబ్బతిన్న అవయవాలను కదిలించేలా వెన్నుపూసలో
అమర్చే చిప్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు మస్క్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ఆరుగురు ప్రయాణించే బైక్.. ఆనంద్ మహింద్రా ఇంప్రెస్

ఇవి కూడా చదవండి: