Waltair Veerayya: నాన్నని మళ్ళీ అలా చూడడం ఎంతో హ్యాప్పీగా ఉంది.. మెగాస్టార్ చిరంజీవి కూతుళ్ళు..
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మెగా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 థియేటర్లలో ఇది విడుదలైంది.
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మెగా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 థియేటర్లలో ఇది విడుదలైంది. తెలుగుతోపాటు హిందీలో కూడా వాల్తేరు వీరయ్య రిలీజ్ అయింది. అమెరికాలో 1200 స్క్రీన్స్ లో మూవీని రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్స్ లో సినిమా విడుదల అయింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో కనిపించాడు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మైత్రీమూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మెగా మేనియా కనిపిస్తోంది.
చాలా రోజుల తర్వాత వింటేజ్ మాస్ లుక్‌లో చిరంజీవి కనిపించడంతో అభిమానులు సైతం ఈ చిత్రాన్ని వీక్షించేందుకు భారీగా థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు.
థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు.
టపాసులు, తీన్ మార్ డ్యాన్స్‌లతో థియేటర్ ప్రాంగణాలు హోరెత్తుతున్నాయి.
థియేటర్ల లోనూ మాస్ జాతర కనిపిస్తోంది.
మెగాస్టార్ స్టెప్పులు, ఇంటర్వెల్ సీక్వెన్స్, రవితేజ-చిరు కాంబో సీన్స్ టైమ్‌లో కాగితాలు ఎగురవేసి డ్యాన్సులు చేస్తున్నారు.
మరోవైపు సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ దగ్గర అభిమానుల కోలాహలం మొదలైంది. మెగా అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. జై చిరంజీవి, స్టార్.. స్టార్ మెగా స్టార్ అన్న నినాదాలతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు మార్మోగుతోంది. అభిమానులతో కలిసి చిత్ర యూనిటీ సినిమా చూస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీ, దర్శకుడు హరీశ్ శంకర్ సంధ్య థియేటర్ కు వచ్చారు. వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజ సైతం థియేటర్ లో సందడి చేశారు. అభిమానులతో కలిసి మూవీ చూస్తూ ఎంజాయ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి చెప్పే డైలాగ్స్, ఆయన వేసే స్టెప్పులకు అనూహ్య స్పందన వస్తోంది. ముందే చెప్పినట్లుగా థియేటర్ లో అభిమానులకు పూనకాలు రప్పిస్తోంది. చిరు స్టెప్పులకు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అభిమానుల కోలాహలం మధ్య సినిమాని వీక్షించడం ఎనహో ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ సినిమా చూశాకా 80, 90 దశకాల అభిమానులకి పాత చిరంజీవి గుర్తురావడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. మొత్తానికి పండక్కి చాలా రోజుల తర్వాత చిరంజీవి తన వింటేజ్ మాస్ లుక్, కామెడీ, యాక్షన్ తో వచ్చి అభిమానులనే కాక ప్రేక్షకులని కూడా అలరిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Sankranthi Rush: సంక్రాంతికి ఊరెళ్తున్న జనాలు.. టోల్ ప్లాజాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
Waltair Veerayya Review: వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ.. పూనకాలు తెప్పించిన మెగాస్టార్
Perni Nani: “మీ అన్నతోనే సెల్ఫీ దిగలేదు.. నువ్వెంత”.. పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని కామెంట్స్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/