Hezbollah Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. ఐదుగురు అక్కడికక్కడే మృతి
Israeli airstrikes hit Hezbollah targets: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందారు. గాజా స్ట్రిప్‌లో ఓ కారుపై ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇందులో డబ్ల్యూసీకేకి చెందిన అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, గతంలో కూడా డబ్ల్యూసీకేపై జరిపిన దాడుల్లో ఏడుగురు అధికారులు మృతి చెందగా.. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ ఘటనతో దాదాపు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఆహార సరఫరాకు అంతరాయం కలిగింది.
తాజాగా, మళ్లీ దాడి చేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ విషయంపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. హమాస్ దాడితో ప్రమేయం ఉన్న ఓ ఉగ్రవాదిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా, పాలస్తీనా గ్రూప్ హమాస్ నిన్న అమెరికన్-ఇజ్రాయెల్ బందీ అయిన ఎడాన్ అలెగ్జాండర్‌ను కలిగి ఉన్న వీడియోను విడుదల చేసింది. కాగా, ఈ వీడియోలో ఉన్న అలెగ్జాండర్.. ఆయన విడుదలకు అమెరికా అధ్యక్షుడిగా నియామకమైన డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.