Home / టాలీవుడ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మీ ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మనోజ్- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో, డాన్స్ లతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన అల్లు అర్జున్.. పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు మెగా ఫ్యామిలీ నుంచి.. ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి కూడా బన్నీకి అభిమానులు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచారు. మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డి పేర్లు ఎక్కువగా వార్తల్లో కూడా వినిపించాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని.. కొంతకాలం నుంచి సహజీవనం కూడా చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క మళ్ళీ సినిమాలతో బిజీ కానుంది. బాహుబలి వంటి భారీ హిట్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఈ తరుణంలోనే మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
Konaseema Thugs: బాబీ సింహ తన కెరియర్ ను ప్రారంభించి సుమారు 13 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఇక ఈ సినిమా విశేషాలను ఆయన ప్రైమ్ 9 తో పంచుకున్నారు.
భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో "ఆర్ఆర్ఆర్" కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసనలకు 2012 జూన్ 14న వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం.. అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే చరణ్, ఉపాసన చెన్నైలో ఉండగా తొమ్మిదో తరగతి వరకూ ఒకే స్కూల్లో చదువుకున్నారు అనే విషయం తెలిసిందే.
Richi Gadi Pelli: కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే చిత్రాలకు ఇప్పుడు ఆదరణ ఉంటోంది. ఓటీటీలు, థియేటర్లు అనే తేడా లేకుండా కొత్త కథలను ప్రేక్షకులను ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తోనే రిచి గాడి పెళ్లి అనే సినిమా రాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశాడు
హనీరోజ్ వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకుల క్రష్‌గా మారిపోయింది. ఈ సినిమాలో అసలు హీరోయిన్ శృతిహాసన్ కన్నా కూడా ఈ ముద్దుగుమ్మకే ఎక్కువ మార్కులు పడ్డాయి.
షూటింగ్ లో తనపై పలు యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా సమంత గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సామ్ సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించింది.