Last Updated:

Bholaa Shankar Teaser: నాకు హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్ అంటున్న చిరంజీవి.. భోళా శంకర్ టీజర్ వచ్చేసింది

Bholaa Shankar Teaser: మెగాస్టార్ ఆ పేరు వింటే చాలు సినీలోకంలో ఓ పవర్ జనరేట్ అవుతుంది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్. అయితే తాజాగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భోళా శంకర్.

Bholaa Shankar Teaser: నాకు హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్ అంటున్న చిరంజీవి.. భోళా శంకర్ టీజర్ వచ్చేసింది

Bholaa Shankar Teaser: మెగాస్టార్ ఆ పేరు వింటే చాలు సినీలోకంలో ఓ పవర్ జనరేట్ అవుతుంది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్. అయితే తాజాగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భోళా శంకర్. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. కాగా గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఇదివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ కూడా ఈ సినిమాపై బాగానే హైప్ క్రియేట్ చేశాయి. అయితే తాజాగా శనివారం సాయంత్రం భోళా శంకర్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఆ ఒక్క డైలాగ్ వేరే లెవెల్(Bholaa Shankar Teaser)

ఈ టీజర్ ఆధ్యంతం యాక్షన్ కమ్ సిస్టర్ సెంటిమెంట్‏తో సాగుతుంది. అలాగే ఎప్పటిలాగే ఈ సినిమాలో చిరు తనదైన మార్క్ కామెడీతోపాటు.. మాస్ యాక్షన్ ఎంటర్ట్మైంట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. “స్టేట్ డివైడ్ అయినా.. అందరు నావాళ్లే.. ఆల్ ఏరియాస్ అప్నా హై.. నాకు హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్.. ” అంటూ చిరు చెప్పిన డైలాగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ ఒక్క డైలాగ్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మెహర్ రమేష్ మొదటిసారిగా చిరంజీవితో సినిమా చెయ్యడమే కాకుండా దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన తిరిగి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేందుకు భారీగానే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా గురించి కొద్ది రోజలుగా చిరు లీక్స్ అంటూ షూటింగ్ ఫోటోస్, వీడియోస్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు చిరంజీవి. ఇక ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.