Last Updated:

Guppedantha Manasu: అక్టోబర్ 28 ఎపిసోడ్ లో దేవయానికి జలక్ ఇచ్చిన వసుధార!

ఆ మాటకు వసు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అప్పుడు ఒక ఎమోషనల్ సాంగ్ ప్లే అవుతుంది.ఇక్కడేమో రిషి, వసు ఏడుస్తుంటే, అక్కడ జగతీ, మహేంద్రలు ఏడుస్తారు.

Guppedantha Manasu: అక్టోబర్ 28 ఎపిసోడ్ లో దేవయానికి జలక్ ఇచ్చిన వసుధార!

Guppedantha Manasu Today: నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. ‘సార్ మీరు ఇంకెప్పుడు అలా అనొద్దు సార్, ఇంకో సారి మీ నోటి నుంచి ఈ మాట వస్తే, నేను తుదిశ్వాస వదులుతాను.’ అని వసు ఏడుస్తూ అంటుంది. ‘వసుధారా నువ్వు నన్ను ఇంకా బాధపెడుతున్నావ్’ అని రిషి అంటాడు. ‘సార్ నేను మీ నీడని సార్, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను సార్. ఇంకెప్పుడు మీరు ఇలా మాట్లాడొద్దు’ అంటూ ఏడుస్తుంది. ‘లేవండి సార్, లేవండి మీరు ఇంకేం ఆలోచించకండి. పడుకోండి’ అంటూ ఓదార్చి, మంచం మీద కూర్చోబెట్టి, రిషికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్లబోతుంది. వసుధారని ఆపి ‘వసుధార ప్రేమ అంటే శాసనం కాదు. అంకితం అని భారీ డైలాగ్ రిషి అంటాడు. ఆ మాటకు వసు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అప్పుడు ఒక ఎమోషనల్ సాంగ్ ప్లే అవుతుంది. ఇక్కడేమో రిషి, వసు ఏడుస్తుంటే, అక్కడ జగతీ, మహేంద్రలు ఏడుస్తారు.

‘మేడమ్, నేను ఈ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళను. రిషి సార్ వెళ్లమన్నా కూడా వెళ్లను. ఒక వేళ రిషి సార్ వెళ్లమన్నా, నాకు నచ్చేతేనే ఇక్కడ నుంచి వెళ్తాను’ అంటూ తెగించి దేవయానికి చెబుతుంది. ఆ మాటకు ‘వసుధారా’ అని గట్టిగా అరిచేస్తుంది దేవయాని. ఆ మాటకు తలుపు తీసి బయటికి వస్తాడు రిషి. ‘ఏం అయ్యింది పెద్దమ్మా’ అని రిషి అడగగానే, ఇంకా వసు కలుగజేసుకుని, ‘అసలు ఏం జరిగిందో నేను చెబుతాను సార్ అంటూ జరిగినది అంతా చెప్పేస్తుంది. నేను మీ కోసం ఈ ఇంటికి రావడం ఈ మేడమ్ గారికి చాలా సంతోషంగా ఉందంట సార్’ అంటూ దేవయానికి భలే జలక్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి: