Last Updated:

Gruhalakshmi: అక్టోబర్ 21 ఎపిసోడ్ లో హీరో గారు తులసి ఇంట్లో అడుగుపెట్టేశారు!

అందరూ నోరు మూసుకొని ఉండండి. నేను ఇంత వరకూ నా పిల్లల మీద ఆధార పడి బతకలేదు. ఇక ముందు అలాగే బ్రతుకుతాను అంటుంది. నా చివరి క్షణం వరకూ ఇదే ఇంట్లో తులసి దగ్గరే ఉంటాను.. చాలా ఇంకా వివరంగా చెప్పాలా?’ అని గట్టిగా హెచ్చరిస్తూ చెప్తాడు.

Gruhalakshmi: అక్టోబర్ 21 ఎపిసోడ్ లో హీరో గారు తులసి ఇంట్లో అడుగుపెట్టేశారు!

Gruhalakshmi Today: నేటి గృహలక్ష్మీ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. ఓ వైపు తులసి ఇంట్లో సందడి మొదలయ్యింది. అమ్మవారికి మొక్కిన తర్వాత ‘మావయ్యా ఇదంతా ఎందుకు? నాకు ఈ ఇళ్లు ఎందుకు మావయ్యా?’ అని తులసి అంటుంది. ‘అలా కాదమ్మా తులసి, నీకంటూ సొంతంగా ఇళ్లు ఉండటమే మంచిదని నాకు అనిపించింది తులసి. ఆ ఇంట్లో అంతా కలిసే ఉన్నా నాకు మాత్రం కలిసి ఉన్నా అని ఫీలింగ్ లేదు. అంతా ఏదో అభధ్రతా భావంతో బతికాం. ఇది నా బాధ్యత అనుకున్నాను’ అంటూ తనదైన శైలిలో మాట్లాడి తులసిని ఒప్పిస్తాడు. ఇంతలో మన హీరో గారు సామ్రాట్ ఎంట్రీ ఇస్తాడు. ‘మేము ఇక్కడున్న విషయం మీకు ఎలా తెలుసని మనసులో అనుకుంటుంది. ‘ఈ ఇల్లు కొనడంలో అతడే సాయం కూడా ఉందమ్మా అని పరందామయ్య అంటాడు. అభి, అనసూయలు అయిష్టంగా చూస్తారు.

కొంతసేపటికి లాస్య మేళం ఇంట్లోకి వస్తుంది. ‘ఏంటిది? తులసి ఉన్న హక్కు ఏంటీ? మాకు లేని అర్హతేంటీ?’ అంటూ గట్టిగానే పరందామయ్యని ఇద్దరూ నిలదీస్తారు. దాంతో తులసి కూడా వాళ్ల మాటలకు అడ్డుపడి ‘గొడవలు వద్దు’అని మర్యాదగా చెబుతుంది. ‘మేము గొడవలు పెట్టడానికి ఇక్కడికి రాలేదు తులసక్కా, మమ్మల్ని రాక్షసుల్లా చూడకండి. మేము కూడా ఈ ఇంట్లోని మనుషులమే, మా వాటా సంగతేంటో మాకు చెప్పండి చాలు’ అంటుంది భాగ్య. ‘నా సొంత డబ్బులతో ఈ ఇల్లు కొని తులసికి ఇచ్చాను. ఇందులో వాటా అడిగే హక్కు మీకెవ్వరికీ లేదు. అందరూ నోరు మూసుకొని ఉండండి. నేను ఇంత వరకూ నా పిల్లల మీద ఆధార పడి బతకలేదు. ఇక ముందు అలాగే బ్రతుకుతాను అంటుంది. నా చివరి క్షణం వరకూ ఇదే ఇంట్లో తులసి దగ్గరే ఉంటాను. చాలా ఇంకా వివరంగా చెప్పాలా?’ అని గట్టిగా హెచ్చరిస్తూ చెప్తాడు.

ఇవి కూడా చదవండి: