Last Updated:

SSMB29: ఒరిస్సాలో మహేష్‌-రాజమౌళి మూవీ సెకండ్‌ షెడ్యూల్‌ – లోకేషన్‌ ఫోటోలు లీక్‌!

SSMB29: ఒరిస్సాలో మహేష్‌-రాజమౌళి మూవీ సెకండ్‌ షెడ్యూల్‌ – లోకేషన్‌ ఫోటోలు లీక్‌!

SSMB29 Latest Shooting Update: సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ రూపొందుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ప్రస్తుతం చిత్రం రూపొందింది. పాన్‌ వరల్డ్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలె సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. రేపు రెండో షెడ్యూల్‌ మొదలుకానుంది. తొలి షెడ్యూల్‌ని ఓ అల్యూమినియ్‌ ఫ్యాక్టరిలో వేసిన సెట్‌లో షూటింగ్‌ జరిపారు. తొలి షెడ్యూల్‌ కూడా పూర్తయై కొన్ని రోజులు బ్రేక్‌ కూడా తీసుకున్నారు.

ఇప్పుడు సెకండ్‌ షెడ్యూల్‌కి రెడీ అయ్యారు. ఈ షెడ్యూల్‌ ఒరిస్సా అడవుల్లో ప్లాన్‌ చేశాడు జక్కన్న. ఇందుకోసం మహేష్‌ బాబు హైదరాబాద్‌ నుంచి ఒరిస్సాకు బయలుదేరారు. ఒరిస్సా రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో కొరపుట్‌ అడవుల్లో ఈ సినిమా షూటింగ్‌ జరుగనుంది. ఇది అడ్వెంచర్‌ ఏరియా. ఇప్పటికే రాజమౌళి అండ్‌ టీం అక్కడి వెళ్లి రెక్కీ చేశారట. అక్కడ షూటింగ్‌కి అనువైన ప్రాంతాలను సెలక్ట్‌ చేసి షూటింగ్‌ కోసం సెట్స్‌ కూడా వేశారట. రేపటి నుంచి అక్కడ అడ్వంచర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ని తెరకెక్కించనన్నట్టు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన లోకేషన్స్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. కాగా పాన్‌ వరల్డ్‌ రూపొందుతోన్న ఈ సినిమా యాక్షన్‌ అడ్వంచర్‌ ఉండనుందని ఇప్పటికే దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఇండియానా జోన్స్ తరహాలో ఈ చిత్రం అడవుల్లో సాగుతుందని చెప్పారు. ఈ అప్‌డేట్‌తో మహేష్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఈ మూవీ విషయంలో జక్కన్న చాలా గొప్యత పాటిస్తున్నాడు. ఈ సినిమా పూజ కార్యక్రమాన్ని కూడా సైలెంట్‌గా కానిచ్చారు. ఇందుకు సంబంధించి ఫోటోలు రిలీజ్‌ చేయలేదు.

అంతేకాదు మూవీ కాస్ట్‌, షూటింగ్‌కి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వడం లేదు. దీంతో ssmb29కి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ అయినా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. కాగా ఈ చిత్రంలో గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. దుర్గ ఆర్ట్స్‌ బ్యానర్‌లో కేఎల్‌ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.