Troll on Rashmika Mandanna: మరోసారి అలాంటి కామెంట్స్.. రష్మికపై నెటిజన్స్ ఫైర్, అసలేమైందంటే..?
![Troll on Rashmika Mandanna: మరోసారి అలాంటి కామెంట్స్.. రష్మికపై నెటిజన్స్ ఫైర్, అసలేమైందంటే..?](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/rashmika-mandanna-2.jpg)
Trolls on Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కన్నడ ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. రీసెంట్‌గా ‘ఛావా’ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె చేసిన కామెంట్స్ కారణం. రష్మిక హిందీలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందింది.
‘హైదరాబాద్ నుంచి వచ్చాను’
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక పాల్గొంది. ఈ సందర్భంగా రష్మిక హిందీ ఆడియన్స్‌ని ఉద్దేశిస్తూ ఓ మెసేజ్ ఇచ్చింది. “నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీ ఫ్యామిలీలో భాగమయ్యానని అనుకుంటున్నా. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్యూ” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై కన్నడ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మాట్లాడుతున్న వీడియోని ఓ నెటిజన్ షేర్ చేస్తూ ఇలా అన్నారు.
రష్మికను బహిష్కరించాలి!
“కొన్నిసార్లు కన్నడ ప్రజల నుంచి నీకు (రష్మిక మందన్నా) వస్తున్న వ్యతిరేకత, నెగిటివ్ కామెంట్స్ చూసి జాలి పడేవాడిని. కానీ ఇప్పుడు వారు కరెక్ట్ అనిపిస్తోంది. నువ్వు ఇలా స్టేట్‌మెంట్స్ ఇచ్చినప్పుడల్లా మిమ్మల్ని విమర్శించడంలో తప్పులేదు అని భావిస్తున్నా. ఈ విమర్శలకు నువ్వు అర్హురాలివి” అంటూ కామెంట్ చేశారు. ఈ పోస్ట్ మరోక యూజర్ ఇలా రాసుకొచ్చారు. “ఆమె పుట్టి, పెరిగింది కర్ణాటకలోనే. చదివింది ఇక్కడే. ఆమె సినీ కెరీర్ మొదలైంది కూడా ఇక్కడే. కానీ, తానుహైదరాబాద్ అమ్మాయినని చెప్పుకోవడానికి రష్మికకు కొంచం కూడా సిగ్గు అనిపించడం లేదా? రష్మిక కన్నడ పరిశ్రమ నుంచి పూర్తిగా తరిమికొట్టాలి. ఆమె సినిమాలను కర్ణాటకలో బ్యాన్ చేయాలి” అని పిలుపునిచ్చారు.
ನಾಚಿಕೆ ಆಗಲ್ಲವಾ ಇವಳಿಗೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಹುಟ್ಟಿ, ಇಲ್ಲಿಯ ನೀರು ಕುಡಿದು ಇಲ್ಲಿಂದ ಬೆಳೆದು ಶಿಕ್ಷಣ ಸಿನಿಮಾದ ಕಲೆ ಪಡೆದು ಇಲ್ಲಿಂದ ಫೇಮಸ್ ಆಗಿರುವ ಇವಳು, ಮತ್ತೇ ಹೈದ್ರಾಬಾದ್ ಅಂತೆ. shameless u #RashmikaMandanna ಕರ್ನಾಟಕದಿಂದ ಇವಳಿಗೆ , ರೀತಿ ನೀಡಿದ ಫ್ಯಾಮಿಲಿ ಅವರಿಗೆ ಓಡಿಸಬೇಕು.ಇವಳದು ಮೂವೀ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಬ್ಯಾನ್ ಮಾಡಬೇಕು.
— Suhas (@Suhas23554862) February 14, 2025
ఇలా రష్మిక మరోసారి తన వ్యాఖ్యలతో కన్నడ ప్రజల ఆగ్రహనికి గురైంది. గతంలోనూ రష్మిక కన్నడ పరిశ్రమను సో కాల్డ్ అంటూ వివాదంలో నిలిచింది. కన్నడ చిత్రం కిరిక్ పార్టీ సినిమాతోనే రష్మిక సినీరంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ చిత్రాన్ని కాంతార హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన తన సొంత బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రం గురించి ఓ అంగ్లా మీడియాతో మాట్లాడుతూ సో కాల్డ్ ప్రొడక్షన్, యాక్టర్ అంటూ ప్రస్తావించింది. దీనిపై రిషబ్ శెట్టి కూడా తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. అప్పటి నుంచి రష్మక కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది.