Janu Lyri: నేను చచ్చిపోతాను.. నా చావుకు కారణం మీరే

Janu Lyri: ఫోక్ సాంగ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న డ్యాన్సర్ జాను లిరి. ఆ సాంగ్స్ వలన వచ్చిన గుర్తింపుతో ఆమె ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. తన ఫోక్ డ్యాన్స్ లతో ఆమె జడ్జీలను మెప్పించి విన్నర్ గా నిలిచింది.అయితే జాను డ్యాన్స్ లు చాలావరకు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. అన్ని పాటలకు ఒకే రకమైన స్టెప్స్ వేస్తుందని, ఆమెకు డ్యాన్స్ రాకపోయినా.. శేఖర్ మాస్టర్ ప్రతిసారి ఆమెను ఆకాశానికి ఎత్తేస్తాడు అని ట్రోల్ చేశారు.
అంతేకాకుండా శేఖర్ మాస్టర్ కు, జానుకు మధ్య రిలేషన్ ఉందని, అందుకే ఆమెను విన్నర్ గా చేశారని కూడా వార్తలు వినిపించాయి. ఇక ఈమధ్యనే శేఖర్ మాస్టర్.. ఈ వార్తలను కొట్టిపడేశాడు. జానుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటి కామెంట్స్ విన్నప్పుడు తాను చాలా. బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చాడు. అయినా కూడా ట్రోలర్స్ జానును వదలలేదు. ఆమె ఎవరితో మాట్లాడినా.. ఏది చేసినా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. భర్త లేకపోయినా.. తన కొడుకు కోసం డ్యాన్స్ చేసుకొని బతుకుతున్న ఆమె.. ఢీతో మరింత ఫేమస్ అయ్యింది.
ఇక సోషల్ మీడియాలో జాను డ్యాన్స్ వీడియోలకు , ఆమె వాయిస్ ను మార్చి అసభ్యకరమైన మాటలను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ వీడియోలపై జాను స్పందించింది. తన ఓపిక నశించిందని, తాను బతకలేకపోతున్నానని.. చచ్చిపోతాను అంటూ ఎమోషనల్ అయ్యింది. ” ఇన్స్టాగ్రామ్ లో నా వాయిస్ ను మార్చి గలీజ్ మాటలు యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. వాటిని నా కొడుకు చూడాడా.. ? నేను మీకు ఏం అన్యాయం చేశాను.
ఎందుకు నా జీవితం మీదనే మీకు అంత శ్రద్ద. మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు కదా. నేను ఈ నిందలు భరించలేకపోతున్నాను. ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని నలుగురుకి నేనే చెప్పేదాన్ని. కానీ, ఇప్పుడు నాకే చచ్చిపోవాలనిపిస్తుంది. వారు వారి బాధల వలన చనిపోవడం లేదు. మీరు పెట్టే బాధల వలన చనిపోతున్నారు. ఒకవేళ నేను చనిపోతే దానికి మీరే కారణం. ఇప్పుడు కూడా మీరు ఆపుతారు అని నేను ఏడవడం లేదు. ఆ ఓపిక నశించింది. అందుకే మాట్లాడుతున్నాను.
మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని చిదిమేస్తారా.. ? అన్నయ్యతో మాట్లాడినా తప్పే.. తమ్మడు అంటూ పిలిచినా తప్పే. ఎవరితో మాట్లాడినా లింకులు అంటగడుతున్నారు. నా కొడుకును మంచిగా చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను. అది కూడా మీరు చూడనిచ్చేలా లేరు. నేను చచ్చిపోతాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.