Last Updated:

Project K Raiders: వరుస అప్డేట్స్‌తో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోన్న ప్రాజెక్ట్-K.. కామిక్ ఈవెంట్లో “రైడర్స్” సందడి

Project K Raiders: ప్రాజెక్ట్-K ఇప్పుడు ఈ పేరే దేశమంతటా సినీలవర్స్ ని ఉర్రూతలూగిస్తోంది. వరుస అప్ డేట్స్ తో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K.

Project K Raiders: వరుస అప్డేట్స్‌తో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోన్న ప్రాజెక్ట్-K.. కామిక్ ఈవెంట్లో “రైడర్స్” సందడి

Project K Raiders: ప్రాజెక్ట్-K ఇప్పుడు ఈ పేరే దేశమంతటా సినీలవర్స్ ని ఉర్రూతలూగిస్తోంది. వరుస అప్ డేట్స్ తో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే , దిశా పఠాని, కమల్ హాసన్ ఇలా భారీ తారాగణమంతా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ను నేడు అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డిగోలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ఆల్రెడీ ప్రకటించారు.

ఈ కామిక్ ఈవెంట్ లో పాల్గొనబోయే మొదటి ఇండియన్ సినిమాగా ప్రభాస్ ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. నేటి నుంచి జూలై 19 నుంచి 23 వరకు జరుగనున్న ఈవెంట్లో ప్రాజెక్ట్-k దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొనబోతున్నారు. అయితే ఇప్పటికే ప్రభాస్, కమల్ హాసన్, చిత్రయూనిట్ అమెరికాకు చేరుకున్నట్టు హాలీవుడ్ నుంచి విడుదలైన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేశాయి. ఇకపోతే జూలై 19 అనగా నిన్న సాయంత్రమే ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. సూపర్ మ్యాన్ లుక్ లో ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరింది.

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

కామిక్ ఈవెంట్ కు రైడర్స్ వచ్చేశారు(Project K Raiders)

ఇక అమెరికాలో గ్రాండ్ గా కామిక్ కాన్ ఈవెంట్ మొదలైంది. ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీం తమ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. గతంలో రైడర్స్ అంటూ మూవీ మేకర్స్ ఓ వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాల్లో వాళ్ళే విలన్ మనుషులు అని తెలుస్తోంది. ఒళ్ళంతా బ్లాక్ సూట్స్ తో ఫేస్ కూడా కవర్ చేసుకొని హాలీవుడ్ గెటప్స్ లా ఉన్నారు ఈ రైడర్స్. మరి తాజాగా నేడు ఉదయం కొంత మందిని రైడర్స్ లా గెటప్స్ వేయించి కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K సినిమాని ప్రమోట్ చేస్తున్నారు చిత్రయూనిట్. Now Begins The End అంటూ బ్యానర్స్ పట్టుకొని ఈ రైడర్స్ కామిక్ కాన్ ఈవెంట్ వద్ద హడావిడి చేస్తున్న ఫొటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాను హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఈవెంట్ కి వచ్చే ఆడియన్స్ పలువురు ఈ ప్రాజెక్ట్-k రైడర్స్ తో ఫోటోలు దిగుతున్నారు.

దీనిని బట్టి ప్రాజెక్ట్ K సినిమాని హాలీవుడ్ లో గట్టిగానే ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రేపు జరగబోయే ఈవెంట్ లో ప్రాజెక్ట్ K సినిమా టైటిల్, గ్లింప్స్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

 

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)